Newsచిరంజీవి - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ సీక్వెల్‌..!

చిరంజీవి – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ సీక్వెల్‌..!

మెగాస్టార్ 40 సంవత్సరాల కేరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆయన కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోని సినిమాలలో ఖైదీ ఒక‌టి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరుకి జోడిగా మాధవి, సుమలత హీరోయిన్గా నటించారు. చిరంజీవిలోని మాస్ ఇమేజ్ను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకు వెళ్లిన సినిమా ఖైదీ. ఈ సినిమాతోనే చిరంజీవికి స్టార్ హీరోగా గుర్తింపు వచ్చింది. అయితే ఖైదీ లాంటి యాక్షన్ సినిమా చేయాలన్న కోరిక చిరంజీవి మనసులో ఎప్పటినుంచో ఉంది.

ఆయన రీయంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఆయన మనసులో ఉన్న కంప్లీట్ యాక్షన్ సినిమా చేయాలన్న కోరిక అయితే నెరవేరటం లేదు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించారు. ఇక్కడ పేరు మాత్రమే ఖైదీ ఉందే తప్ప అది కంప్లీట్ యాక్షన్ సినిమా కాదు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. అయితే ఇప్పుడు ఖైదీ సినిమాకి సీక్వెల్ కథని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాల నుంచి లీక్ అయింది.

ఖైదీ సీక్వెల్ స్టోరీ రెడీ చేయమని స్వయంగా చిరంజీవి త్రివిక్రమ్‌ను కోరడంతో త్రివిక్రమ్ తన టీంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మరో రెండు నెలల్లో కంప్లీట్ కానుంది. గుంటూరు వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా ? లేదా ఖైదీ సినిమా సీక్వెల్ చిరంజీవి తెరకెక్కిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆగస్టు సెప్టెంబర్ వరకు ఉంటుందని అంటున్నారు. సంక్రాంతికి త్రివిక్రమ్ ఖాళీ అయిపోతాడు. ఆ తర్వాత చిరంజీవి ఖైదీ సీక్వెల్ కథ మీద కసరత్తులు చేసే టైం ఆయనకు దొరుకుతుంది. ఈలోగా చిరంజీవి చేయాల్సిన రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. కురసాల కళ్యాణకృష్ణ, బింబిసారా ఫేమ్ వశిష్ట ప్రాజెక్టులకు చిరంజీవి ఒకే చెప్పారు. మరి ఈ రెండు ప్రాజెక్టుల మధ్యలో త్రివిక్రమ్ ఖైదీ సీక్వెల్ ఉంటుందా.. లేదా త్రివిక్రమ్ – బన్నీ సినిమా తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news