Newsమూడు సినిమాలు రు. 210 కోట్ల రెమ్యున‌రేష‌న్‌... ప‌వ‌న్ స్టామినా... మైండ్...

మూడు సినిమాలు రు. 210 కోట్ల రెమ్యున‌రేష‌న్‌… ప‌వ‌న్ స్టామినా… మైండ్ బ్లాకింగ్ లెక్క‌లు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నారు. ఇటీవల మేనల్లుడు సాయి ధరమ్‌తో కలిసి నటించిన బ్రో సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ఇక ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఓజీ – హరీశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ – క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఇటు రాజకీయాలు.. అటు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న పవన్ ముందుగా షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి ? క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. బ్రో సినిమాకు కేవలం 20 రోజులు కాల్ సీట్లు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు ఏకంగా రు. 55 కోట్ల రెమ్యూనరేషన్ ముట్టింది. దీనిని బట్టి పవన్ క్రేజీ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.

ఇక పవన్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల రెమ్యున‌రేషన లెక్కలు చూస్తే మైండ్ బ్లాకింగ్ గా కనిపిస్తాయి. ఓజి సినిమాకు 100 కోట్లు – భగత్ సింగ్ సినిమాకు 70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న పవన్.. హరిహర వీరమల్లు సినిమాకు 40 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు ఎప్పుడో నిర్మాత ఏఏం.రత్నం అడ్వాన్సులు ఇచ్చి ఉండడంతో.. పాత కమిట్మెంట్ కావడంతో రెమ్యునరేషన్ కాస్త తక్కువ అనుకోవాలి.

ఈ మూడు సినిమాలతోనే పవన్ ఖాతాలో ఏకంగా రు. 210 కోట్ల అమౌంట్ వచ్చి పడుతుంది. టాలీవుడ్ లో సినిమా ప్లాపులు అవుతున్న కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అంటే ఆ క్రేజ్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే సొంతం అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news