Moviesమెగా 156లో విలన్ గా ఆ స్టార్ హీరో.. బాహుబలికి మించిన...

మెగా 156లో విలన్ గా ఆ స్టార్ హీరో.. బాహుబలికి మించిన హిట్ కొట్టేలా ఉన్నాడే..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెగాస్టార్ చిరంజీవి పేరు మారు మ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా భోళాశంకర్ డిజాస్టర్ తర్వాత చాలామంది చిరంజీవిను ట్రోల్ చేశారు ..ఎగతాళి చేశారు. అయితే అలాంటివి ఏమీ పట్టించుకోని చిరంజీవి తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు . రీసెంట్గా వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

దసరా సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు మేకర్స్. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది . సుమారు 350 కోట్లు బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయిస్తున్నారట యు వి క్రియేషన్స్. కాన్సెప్ట్ పోస్టర్ పంచభూతాలైన గాలి-నీరు-నేల-నిప్పు ఆకాశంలో రూపొందించారు.

అంతేకాదు ఈ సినిమాలో భారీ కాస్టింగ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో రానా దగ్గుబాటి చిరంజీవికి విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. కొందరు బాహుబలికి మించిన హిట్ కన్ఫామ్ అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news