Newsటీమిండియా క్రికెట‌ర్‌ను పెళ్లి చేసుకుని కెరీర్ పోగొట్టుకున్న ఈ హీరోయిన్ ఎవ‌రో...

టీమిండియా క్రికెట‌ర్‌ను పెళ్లి చేసుకుని కెరీర్ పోగొట్టుకున్న ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

సినిమా రంగంలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా త‌క్కువగా ఉంటుంది. అందుకే క్రేజ్ ఉన్న‌ప్పుడే వ‌రుస సినిమాలు చేసి.. నేమ్ అండ్ ఫేమ్‌తో పాటు నాలుగు రాళ్లు వెన‌కేసుకుంటారు. హీరోయిన్ గా ఫేడౌట్ అవుతున్న త‌రుణంలో హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. లేదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటారు. కానీ, కొంత మంది హీరోయిన్లు మాత్రం కెరీర్ పీక్స్ లోకి వెళ్తున్న త‌రుణంలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి న‌ట‌న‌కు పులిస్టాప్ పెట్టేశారు.

ఈ కోవ‌కే అశ్రిత శెట్టి కూడా చెందుతుంది. కర్ణాటకకు చెందిన అశ్రిత శెట్టి.. 2010లో మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించింది. ప‌లు అందాల పోటీల్లో టైటిల్స్ గెలుచుకుని.. అనేక బ్రాండ్స్ కు అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. 2012లో తెలికేడ బొల్లి అనే తుళు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ త‌ర్వాత కోలీవుడ్ లో అడుగు పెట్టిన అశ్రిత శెట్టి.. ఉదయమ్ NH4లో హీరో సిద్ధార్థ్ కు జోడీగా న‌టించి త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

ఆ త‌ర్వాత కోలీవుడ్ లోనే మ‌రో రెండు సినిమాలు చేసింది. కెరీర్ కాస్త ఊపందుకుంటున్న టైమ్ లో అశ్రిత శెట్టి.. టీమిండియా క్రికెట‌ర్ మనీష్ పాండేతో పెళ్లిపీటలెక్కేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా పేరున్న మనీష్ పాండే 2019లో ముంబై వేదిక‌గా అశ్రితను వివాహం చేసుకున్నాడు. పెళ్లి త‌ర్వాత కూడా అశ్రిత శెట్టి త‌న న‌ట‌నా జీవితాన్ని కొన‌సాగిస్తుంద‌ని అంద‌రూ భావించారు.

కానీ, 2019 త‌ర్వాత ఆమె మ‌ళ్లీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. పెళ్లి చేసుకుని కెరీర్‌ను పోగొట్టుకుంది. సోష‌ల్ మీడియాలో మాత్రం అశ్రిత చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ స్ట‌న్నింగ్ ఫోటోషూట్ల‌తో పాటు జిమ్ వీడియోల‌ను పంచుకుంటూ ఉంటుంది. ఇక అశ్రిత త‌న ఫిజిక్ ను ప‌ర్ఫాక్ట్ గా కాపాడుకుంటోంది. పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా.. గ్లామ‌ర్ త‌గ్గ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news