Newsఈ ఫొటోలో ర‌ష్మిక ప‌క్క‌న ఎవ‌రో గుర్తు ప‌ట్టారా... ఆ...

ఈ ఫొటోలో ర‌ష్మిక ప‌క్క‌న ఎవ‌రో గుర్తు ప‌ట్టారా… ఆ రిలేష‌న్ తెలిస్తే ఉన్న మ‌తిపోవాల్సిందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గీత గోవిందం, పుష్ప వంటి భారీ హిట్స్‌తో రష్మిక మందన్న అగ్ర హీరోయిన్‌గా అవతరించింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఏకంగా 8 సినిమాల్లో నటిస్తోంది. ఒకేసారి 8 సినిమాలకు ఆమె సైన్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వాటి షూటింగ్స్ లో సూపర్ బిజీగా ఉంది.

ఆ బిజీలో కూడా అభిమానులతో టచ్ లో ఉంటూ వారి పట్ల తన ప్రేమను కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక తల్లికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక తల్లి పేరు సుమన్ మందన్న. ప్రస్తుతం రష్మిక వయసు 27 ఏళ్ళు. ఆ లెక్కన చూసుకుంటే ఆమె తల్లికి 45 ఏళ్ల పైగానే వయసు ఉంటుందని అనుకుంటారు. కానీ చూసేందుకు రష్మిక తల్లి మాత్రం చాలా యంగ్గా కనిపిస్తారు. 30 ఏళ్ల వయసున్న ఆమె రష్మికకు అక్క లాగా ఉంటారు.

ప్రస్తుతం రష్మిక తన తల్లితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండగా దాన్ని చూసి అభిమానులు ఎవరీమా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రష్మికకి అక్క ఉందా? అని కామెంట్ చేస్తున్నారే తప్ప ఆమె రష్మిక తల్లి అని గుర్తించలేకపోతున్నారు. చివరికి ఆ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం అమ్మ లాగానే రష్మిక ఉందని వారు అంటున్నారు. ఇకపోతే కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.4 నుంచి 7 కోట్లు తీసుకుంటుందని సమాచారం.

అందం అభినయంతో సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. పుష్ప 2 సినిమాతో ఆమె రేంజ్ మరో లెవెల్ కి వెళుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ తో రష్మిక డేటింగ్ చేస్తుందని పుకార్లు ఉన్నాయి. దీనిని ఈ యాక్టర్లలో ఎవరూ కూడా కన్ఫామ్ చేయలేదు. అయినా వారు కలిసి జీవిస్తున్నట్లు చెప్పడానికి కొన్ని ఫోటోలు, వారి వెకేషన్స్ ఆధారంగా చూపుతున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news