Newsకాంతారా హీరోయిన్ ' సప్త‌మీగౌడ ' బ్యాక్‌గ్రౌండ్ తెలుసా...!

కాంతారా హీరోయిన్ ‘ సప్త‌మీగౌడ ‘ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా…!

కాంతారా సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్న నటి సప్తమి గౌడ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ సినిమా హిట్ అయ్యాక సప్తమి గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సప్తమి స్వస్థలం బెంగళూరు ఆమె చదువు అంతా అక్కడే కొనసాగింది. ఆమెకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో చదువుతున్నప్పుడే చాలాసార్లు ఆమె రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని విన్ అయింది.

నటన మీద ఉన్న ఆసక్తితో ముందుగా మోడల్‌గా కెరీర్‌ మొద‌లు పెట్టి తొలిసారిగా కన్నడలో పాప్‌కాన్ మంకీ టైగర్ సినిమాతో వెండితెరపై మెరిసింది. ఈ సినిమాలో ఆమె నటనకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా సొంతం చేసుకుంది. కాంతారా సూపర్ హిట్ అయ్యాక ఆమెకు వరుస పెట్టి ఛాన్సులు రావడంతో ఆమె డేట్ల కోసం స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు కూడా పడిగాపులు పడే స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం ఆమె ది వ్యాక్సిన్ వార్‌, యువ, కాళీ, కాంతారా 2 తదితర సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంది. త్వరలోనే హీరో నితిన్ తమ్ముడు సినిమాతో తెలుగులోను అలరించనుంది. ఇక సప్త‌మీగౌడ ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తూ తన ఫిట్నెస్ కాపాడుకుంటుంది. ఆమె ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు వర్కౌట్స్ ఎక్కువగా చేస్తానని చెప్తూ ఉంటుంది.

ఏది ఏమైనా ఒకే ఒక్క సినిమాతో సప్తమి కూడా నేషనల్ వైడ్‌ గా సూపర్ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు సప్త‌మీగౌడకు తెలుగులో వరుస అవకాశాలు ఇచ్చేందుకు కుర్ర హీరోల నుంచి.. అగ్ర దర్శకుల వరకు ఆమె వెంట పడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news