Newsబిగ్‌బాస్‌లోకి ప్ర‌భాస్ హీరోయిన్ ఎంట్రీ... ఎవ‌రో గుర్తు ప‌ట్టారా...!

బిగ్‌బాస్‌లోకి ప్ర‌భాస్ హీరోయిన్ ఎంట్రీ… ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే బిగ్ బాస్ షోకు సౌత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ప్రతి ఏడాది వరుసగా సీజన్లు వస్తూనే ఉంటున్నాయి. ప్రస్తుతం తెలుగులో 7వ‌ సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది. తమిళంలో అక్టోబర్ 1న 7వ సీజన్ ప్రారంభం అవుతుంది. ఈసారి 20 మంది కంటెస్టెంట్లు తమిళ‌ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు.

అందులో ఒకప్పటి హీరోయిన్ కూడా ఉండటం విశేషం. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్న మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన నటించిన హీరోయిన్ కావటం విశేషం. ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ లో జోడి కట్టిన శ్రీదేవి ఇప్పుడు తమిళ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తల్లి మంజుల – తండ్రి విజయకుమార్ నటవారసత్వాన్ని అందిపుచ్చుకున్న శ్రీదేవి బాలనటిగా కెరీర్ మొదలు పెట్టింది.

జయంత్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ అయింది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా ఆ తర్వాత తరుణ్ నిన్నే ఇష్టపడ్డాను, ఆర్యన్ రాజేష్ నిరీక్షణ, ఆదిలక్ష్మితో పాటు కొన్ని సినిమాలలో నటించింది. తెలుగులో ఆమె చేసిన చివరి చిత్రం 2011 వచ్చిన సెల్‌ఫోన్ మూవీ. ఆ తర్వాత కన్నడలో 2016లో లక్ష్మీ సినిమా చేసి సినిమా పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పేసింది. బుల్లితెరపై మాత్రం పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

తాజాగా ఆమె తమిళ బిగ్ బాస్ 7వ సీజన్లో హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇది ఇలా ఉంటే తమిళంలో మూడో సీజన్లో శ్రీదేవి సోదరి వనిత విజయ్ కుమార్ పాల్గొంది. అయితే ఆమె రెండోవారమే షో నుంచి ఎలిమినేట్ అయింది. ఇక శ్రీదేవి, వనిత విజయ్ కుమార్ మరో సిస్టర్ ప్రీతి. ఆమె తెలుగులో శివాజీ హీరోగా వచ్చిన వైఫ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రీతి ఎవరో కాదు తమిళ స్టార్ డైరెక్టర్ సింగం హరికి భార్య‌ కావడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news