Newsఅట్లీ ఆ డైలాగులు రాజ‌మౌళికి కౌంట‌ర్‌గా వేశాడా..!

అట్లీ ఆ డైలాగులు రాజ‌మౌళికి కౌంట‌ర్‌గా వేశాడా..!

తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఐదు మాత్రమే. కానీ ప్రతి ఒక్క సినిమా వందల కోట్ల వసూళ్లు సాధించి రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా అట్లీ షారుక్ ఖాన్ తో తెరకెక్కించిన జవాన్ సినిమా రు. 1000 కోట్ల వసూళ్లు నమోదు చేసి ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఒకవైపు జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర కొనసాగిస్తున్న సమయంలో అట్లీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇవి టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిని టార్గెట్గా చేసుకొని అట్లీ చేశాడా ? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అట్టీని విజయ్ – షారుక్‌ఖాన్‌ల‌లో ఎవరిని ? ఎంపిక చేసుకుని మళ్లీ సినిమా చేయాలి అనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించింది. దానికి అట్లీ ఆన్సర్ చేస్తూ గతంలో ఇద్దరితో పని చేశాను.. ఈసారి వాళ్ళిద్దరితో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసి మూడు వేల కోట్ల వసూళ్లను సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

అయితే అట్లీ రు. 3000 కోట్లు మల్టీస్టారర్ సినిమాతో మూడు వేల కోట్లు కొడతానని చెప్పడంతో ఇప్పటివరకు మల్టీస్టారర్ సినిమాలు తీసిన డైరెక్టర్లను టార్గెట్గా చేసుకుని ఈ కామెంట్లు చేశాడని అంటున్నారు. రాజమౌళి బాహుబలి సీరిస్‌ సినిమాలు చేసినా, ఎన్టీఆర్ – రామ్ చరణ్‌తో ఆర్ఆర్ సినిమా చేసిన ఆ స్థాయిలో వసూళ్లు రాలేదు. ఆర్ఆర్ సినిమాకు రు. 1200 కోట్లు మాత్రమే వచ్చాయి.

ఇప్పుడు విజయ్ – షారుక్ ఇద్ద‌రు క్రేజీ హీరోల‌తో మల్టీస్టారర్ సినిమా చేసి మూడు వేల కోట్లు కొడతానని చెప్పడాన్ని బట్టి చూస్తే తాను ఇప్పటివరకు స్టార్ దర్శకులు తీసిన మల్టీ స్టార‌ర్ సినిమాలకు మించిన సినిమా తీస్తానని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఎప్పుడూ ఇండియ‌న్ మార్కెట్‌, ఆ రేంజ్ వ‌సూళ్లు అంటే మాట్లాడే ద‌ర్శ‌కులు అంద‌రికి అట్లీ కౌంట‌ర్ వేశాడ‌ని… అందులో రాజ‌మౌళి కూడా ఉన్నాడ‌ని జ‌నాలు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news