Newsరామ్మా చిల‌క‌మ్మా సాంగ్ విష‌యంలో చిరుకు ఆ ఇద్ద‌రితో పెద్ద గొడ‌వ‌.....

రామ్మా చిల‌క‌మ్మా సాంగ్ విష‌యంలో చిరుకు ఆ ఇద్ద‌రితో పెద్ద గొడ‌వ‌.. తెర‌వెన‌క స్టోరీ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో చూడాలని ఉంది ఒకటి. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత‌ చలసాని అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు మణిశర్మ అందించిన ఆల్బమ్‌తో పాటు నేపథ్య‌ సంగీతం సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమా పాటలు విన్నా.. సినిమా చూస్తున్నా సంగీతంతో అలా కనెక్ట్ అయిపోతాం. ఈ ఆల్బమ్‌కు అప్పట్లో వినాలని ఉంది అనే టైటిల్ పెట్టి ప్రత్యేకంగా రిలీజ్ చేశారు.

మొదటిసారి నలుగురు నాన్ తెలుగు సింగర్స్ పాడిన ఆల్బమ్‌గా చూడాలని ఉంది చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమాలో రామ్మా చిలకమ్మా పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం తో పాటించాలని చిరంజీవి అనుకున్నారు. అయితే దర్శకుడు గుణశేఖర్ – సంగీత దర్శకుడు మణిశర్మ ఇద్దరు ఈ పాట బాలు పడటం కన్నా ఉదిత్ నారాయణ పాడితే చాలా బాగా వస్తుందని నమ్మారు. ఉదిత్ నారాయ‌ణ‌తోనే పాడిస్తామని చెప్పారు. చిరంజీవి మాత్రం వద్దని పట్టుబట్టారు.

వీళ్ల మ‌ధ్య పంతంతో సాంగ్ రికార్డింగ్ ఆగిపోయింది. నాలుగు ఐదు రోజులు పెద్ద చర్చలు నడిచాయి. చివరికి చిరంజీవికి ఇష్టం లేకపోయినా కూడా ఉదిత్ నారాయణతో ఈ పాట పాడించారు. రామచిలకమ్మ సాంగ్ తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పటికే నిలిచిపోయే సాంగ్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్ వింటున్నా కూడా ఎంత ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుందో చెప్పక్కర్లేదు. ఇక ప్ర‌తి సినిమాలోనూ చిరంజీవి పరిచయ సన్నివేశం పాటతో గాని ఫైట్‌తో గాని మొదలవుతూ ఉంటుంది.

పాటలు అయితే బ్రేక్ డాన్స్ ఉండాల్సిందే.. కానీ ఈ సినిమాలో అందుకు భిన్నంగా క్లాసికల్‌గా ఉండే యమహానగరి పాట‌ను పెడతామని గుణశేఖర్ సలహా ఇవ్వడంతో అందుకు చిరంజీవి – అశ్వినీద‌త్‌ ఇద్దరు అంగీకరించారు. ఈ పాటకు వేటూరి సుందర రామ్మూర్తి నాలుగు చరణాలు ఇవ్వగా.. అన్ని బాగున్నా కూడా మూడు చరణాలు మాత్రమే పెట్టారు. ఒక క్లాసికల్ పాటతో చిరంజీవి పాత్రను పరి చేయటం అప్పట్లో ఒక సెన్సేషనల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news