Moviesవార్నీ..పవన్ మూవీ లో ఆ సాంగ్ ని కొరియోగ్రఫీ చేసింది బన్నీనా..?...

వార్నీ..పవన్ మూవీ లో ఆ సాంగ్ ని కొరియోగ్రఫీ చేసింది బన్నీనా..? అందుకే ఇంత హిట్ అయ్యింది..!!

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయనంటే అభిమానులు పడి చచ్చిపోతూ ఉంటారు. ఆయన్ని ఓ హీరోలా కాకుండా ఓ దేవుడి గా భావిస్తూ ఉంటారు . పవన్ కళ్యాణ్ అన్న పేరు వినపడగానే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ ఉంటారు అభిమానులు . కేవలం సామాన్య జనాలే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే.

అలాంటి లిస్టులోకే వస్తాడు అల్లు అర్జున్ . కాగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఓ సాంగ్ కొరియోగ్రఫీ చేశాడు అన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలియడంతో ఫ్యాన్స్ ఈ న్యూస్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు . ఆ సినిమా మరేదో కాదు గుడుంబా శంకర్ . పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో “చిలకమ్మా” అనే సాంగ్ను అల్లు అర్జున్ కొరియోగ్రఫీ చేశాడు.

అల్లు అర్జున్ డ్యాన్స్ లో పర్ఫెక్ట్ మనకు తెలిసిందే . పవన్ కళ్యాణ్ కూడా సరదాగా అల్లు అర్జున్ కి ఈ సాంగ్ ఇస్తే ఎలా చేస్తాడు అన్న ఉద్దేశంతో ఇచ్చాడట . సింపుల్ సింపుల్ స్టెప్స్ అయినా సరే అభిమానులకు ఆకట్టుకునే విధంగా కొరియోగ్రఫీ చేసి సినిమా ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యేలా చేశాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ వారాలు అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news