Newsభ‌యంక‌ర డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు ఏడుపొక్క‌టే త‌క్కువ‌...!

భ‌యంక‌ర డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు ఏడుపొక్క‌టే త‌క్కువ‌…!

ఎస్ పవన్ కళ్యాణ్ మరో భయంకర డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమాకు ఓకే చెప్పారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సురేందర్ రెడ్డి. సైరా లాంటి డిజాస్టర్ తర్వాత ఏజెంట్ లాంటి భీభ‌త్స‌మైన డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి మళ్ళీ వెళ్లి గారెల బుట్టలో పడ్డాడు. అసలు విషయంలోకి వెళితే నిర్మాత రామ్ తాళ్లూరి సురేందర్ రెడ్డి కి ఓ అవకాశం ఇస్తున్నారు. దానికి సై అన్నారు పవర్ స్టార్. ఇక ఆస్థాన కథ‌కుడు వ‌క్కంతం వంశీ రెడీ గా ఉండనే ఉన్నాడు.

ఈ మేరకు ఈరోజు ఆఫీసు తీసి పూజ చేశారు. రామ్ తాళ్లూరికి పవన్ ఎప్పటినుంచో ఒక సినిమా బాకీ ఉన్నాడు. జనసేన ఆరంభంలో డిజిటల్ కార్యక్రమాలు అన్ని రామ్ ఆఫీస్ నుంచి నిర్వహించారు. ఈ సినిమాకు గతంలోనే సురేందర్ రెడ్డి దర్శకుడు అని పేరు వినిపించింది. అయితే ఏజెంట్ లాంటి భీభ‌త్స‌మైన డిజాస్ట‌ర్‌ తర్వాత ఈ సినిమా ఉండదని అందరూ అనుకున్నారు.

అయితే అనూహ్యంగా ఈ సినిమా ఇప్పుడు వచ్చింది. పవన్ ఇప్పటికే వీరమల్లు – ఓజి – ఉస్తాద్‌ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇలాంటి టైంలో ఇప్పుడు సురేందర్ రెడ్డి సినిమా కూడా సెట్స్ మీదకు రానుందని తెలిసిపోయింది. ఇప్పటికే వరుసగా రీమేక్‌ సినిమాలు చేసుకుంటూ వస్తున్న పవన్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా అనగానే పవన్ అభిమానులకు ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఉంది.

అన్నట్టు మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకు కథ‌ అందిస్తున్న వక్కంతం వంశీ నితిన్ హీరోగా తీస్తున్న సినిమా త్వరలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అంతకు ముందు బన్నీతో వంశీ నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ సినిమా తీసిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news