Newsపెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్.. పెళ్లికూతురు ఎవరంటే... అనుష్క కాదండోయ్‌...!

పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్.. పెళ్లికూతురు ఎవరంటే… అనుష్క కాదండోయ్‌…!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ వరుస క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పటికే సాహో,రాధేశ్యామ్, ఆదిపురుష్‌ సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చిన ప్ర‌భ‌స్‌ ఆ సినిమాల తో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టుకే సినిమాలతో బిజీగాా ఉన్నాడు. సలార్ సినిమా వచ్చేనెల 28న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి 2898 AD సినిమాపై కూడా గ్లోబల్ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే నాలుగు పదుల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయాడు. ఇదే సమయంలో స్టార్ హీరోయిన్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.. ప్రభాస్ తన పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా తన అభిమానులకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పకుండా ఎప్పుడూ సినిమాలే అంటూ సినిమాలోనే బిజీ అయిపోయారు.

ఆయన పెళ్లికి సంబంధించిన విషయంలో మాత్రం ఆయన అభిమానులు ఎంతో నిరాశగా ఉన్నారు. ఎక్కడో ఒకచోట అనుష్క- ప్రభాస్ లు మాత్రం పెళ్లి చేసుకుంటారనే చిన్న ఆశ మాత్రం వారీలో ఉంది. కానీ ప్రభాస్- అనుష్క అభిమానులకు మాత్రం ఆ కోరిక తీరేతట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్‌ అనుష్కను కాకుండా మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందట. అంతేకాకుండా ఆ అమ్మాయి వారి బంధువుల అమ్మాయిని కూడా తెలుస్తుంది.

ఈ పెళ్లి సంబంధం చూసింది కూడా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అనీ ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పేరెంట్స్ శ్యామల దేవికి ఆమె ఫోటో చూపించారట. ఆ ఫోటో చూసిన ప్రభాస్ పెద్దమ్మకి ఆ అమ్మాయి ఎంతో నచ్చిందట. ఇక దాంతో ప్రభాస్‌కు కూడా ఈ విషయం చెబితే ఎంతో సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. అమ్మాయి ఫోటో చూసిన ప్రభాస్ కూడా పెళ్లికి ఒకే చెప్పేశారట. ఇక అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో బిజినెస్ కు సంబంధించిన కోర్స్ చేస్తుందట.

చదువు పూర్తవుగానే ఇండియాకు వచ్చాక ప్రభాస్ కి అమ్మాయికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారట. ఇక ఈ గుడ్ న్యూస్ వినగానే కొంతమంది ప్రభాస్ అభిమానులు ఆయనకు పెళ్లి జరుగుతుంది అని సంతోష పడినప్పటికీ మరోపక్క అనుష్కని పెళ్లి చేసుకోవడం లేదే అని బాధపడుతున్నారు. అయితే ప్రభాస్ పెళ్ళంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. మరి ఇందులోనైనా నిజముందా లేదా అని కొంతమంది నెటిజన్లు అనుమాన పడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news