Newsమ‌హేష్‌బాబుకు జీవితంలో మ‌ర్చిపోలేని హెల్ఫ్ చేసిన ప‌వ‌న్‌... ఎప్ప‌ట‌కీ ఆ రుణం...

మ‌హేష్‌బాబుకు జీవితంలో మ‌ర్చిపోలేని హెల్ఫ్ చేసిన ప‌వ‌న్‌… ఎప్ప‌ట‌కీ ఆ రుణం తీర్చుకోలేడేమో..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్లు కొట్టడం కామన్ గా జరుగుతూ ఉంటుంది మహేష్ బాబు కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమా పోకిరి. 2006 సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ బాబును తిరుగులేని హీరోగా నిలబెట్టడంతో పాటు మాస్లో తిరుగులేని ఇమేజ్ తెచ్చి పెట్టింది.

అప్పట్లో పోకిరి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మహేష్ కు జోడిగా సన్న‌న‌డుము సుందరి ఇలియానా హీరోయిన్గా నటించింది. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు అంటూ మహేష్ బాబు కొట్టిన దెబ్బకి టాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయింది. అప్పటి స్టార్ హీరోలా మైండ్ నిజంగానే బ్లాక్ అయిపోయింది. అయితే పూరి జగన్నాథ్ ఈ సినిమా కథను ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెప్పారు.

అంతకుముందే వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన బద్రి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తనకు తొలి సినిమా ఛాన్స్ ఇచ్చిన పవన్ మీద అభిమానంతో పూరీ ఈ కథను పవన్ కి వినిపించగా పవన్ కు ఎందుకో నచ్చలేదు. చివరకు అలా చేతులు మరి మహేష్ దగ్గరికి వచ్చింది. మహేష్ వెంటనే ఈ కథను ఓకే చేశాడు.

కేవలం ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న పోకిరి తిరిగిలేని సూపర్ హిట్ అయింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వదులుకున్న ఈ సినిమా నిజంగా మహేష్ బాబు దశ దిశను మార్చేసింది. తనకు ఇంత మంచి కథ ఇచ్చిన పవన్ కు మహేష్ ఎప్పటికీ రుణపడి ఉండాలేమో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news