Newsవిజ‌య్‌వ‌ర్మతో పెళ్లీ గిళ్లీ లేదు... కేవ‌లం అందుకే మాత్ర‌మే త‌మ‌న్నా వాడుకుంటోందా....!

విజ‌య్‌వ‌ర్మతో పెళ్లీ గిళ్లీ లేదు… కేవ‌లం అందుకే మాత్ర‌మే త‌మ‌న్నా వాడుకుంటోందా….!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు హీరోయిన్గా 18 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన నట జీవితం చాలా సంతృప్తిగా ఉందని తెలిపింది. రజనీకాంత్ హీరోగా నటించిన జైల‌ర్‌ సినిమాలో ఒక పాటతో పాటు రెండు సీన్లలో నటించిన తమన్నా ఆ సినిమాలో కంప్లీట్ గా డామినేట్ చేసిందని చెప్పాలి.

తాజాగా చిరంజీవికి జోడిగా భోళాశంకర్ సినిమాతో తెలుగు ప్రజల ముందుకు వచ్చింది తమన్నా. కెరీర్ గ్రాఫ్ పడిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా పాట తమన్న కెరీర్‌ను ఒక్కసారిగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది. అయితే ఈ ఒక్క పాట‌ తర్వాత తమన్నా మళ్లీ పెళ్లి వాయిదా వేసుకున్నట్టు ఆమె మాటలే చెబుతున్నాయి. తమన్నా బాలీవుడ్ నటుడు విజయవర్మ ప్రేమలో పడిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని తమన్నా కూడా ఓపెన్ గానే చెప్పింది. ఇద్దరు కలిసి చెట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. సీక్రెట్ గా డేటింగ్ కూడా చేస్తున్నారు. దీంతో పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు తమన్నా ఆన్స‌ర్ ఇస్తూ వివాహంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని చెప్పింది. ఒక దశలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. అయితే ప్రస్తుతం జీవితం బాగా సాగుతుంది.. దీంతో దానిపై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నా అని చెప్పింది.

వైవిద్య భరిత కథలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.. అలాంటి వాటిని ఆనందంగా అంగీకరిస్తున్నా ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నాను కాబట్టి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఓపెన్ గానే చెప్పింది. దీనిని బట్టి చూస్తే కొంతకాలం విజయవర్మతో ఎంజాయ్ చేస్తూ జీవితం గడపాలని.. సినిమాలలో అవకాశాలు వస్తున్నప్పుడు ఎందుకు ? వదులుకోవాలి.. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన అనవసరం అన్న నిర్ణయానికి ఆమె వచ్చేసినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news