Newsటాలీవుడ్ కుర్ర హీరో పెళ్లి... అమ్మాయి ఎవ‌రో తెలుసా...!

టాలీవుడ్ కుర్ర హీరో పెళ్లి… అమ్మాయి ఎవ‌రో తెలుసా…!

టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. గ‌త రెండు సంవ‌త్స‌రాల‌లో ఎంతో మంది స్టార్ కుర్ర హీరోలు పెళ్లి పీట‌లు ఎక్కేశారు. తాజాగా ఈ లిస్టులోకి మరో కుర్ర హీరో చేరాడు. అతడి పేరు అలియాస్ అరుణ్ అదిత్. నివేదిత అనే అమ్మాయిని మనోడు పెళ్లాడబోతున్నాడు. ఇది పూర్తిగా పెద్దలు కుదుర్చిన పెళ్లిగా తెలుస్తోంది. నివేదిత‌ను పెద్ద‌లే కుదిర్చి పెళ్లి చేయ‌బోతున్నారు.

వీళ్ళ వివాహానికి సంబంధించిన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం వీరు పెళ్లి తమిళనాడులోని తిరువూర్‌లో జరగనుంది. అరుణ్ అదిత్‌ విషయానికి వస్తే కథ అనే సినిమాతో టాలీవుడ్కు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత గరుడవేగా – డియర్ మేఘ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్గా ప్రేమదేశం అనే సినిమాలో కూడా నటించాడు.

వరుసగా సినిమాలు చేస్తున్న ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే రాలేదు. అందుకే గత ఏడాది తన పేరును అరుణ్ అదిత్ నుంచి త్రిగుణ్‌గా మార్చుకున్నాడు. అలా మారిన పేరుతో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా అనే సినిమాలో కూడా నటించాడు. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నాడు. చేతిలో పలు తెలుగు – తమిళ సినిమాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న త్రిగుణ్‌కు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు పెళ్లి తర్వాత అత‌డి కెరీర్ గొప్ప ద‌శ‌ తిరగాలని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news