Moviesవామ్మో.. మన మహేశ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా..? వైరల్...

వామ్మో.. మన మహేశ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా..? వైరల్ అవుతున్న (వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. మనకు బాగా తెలిసిన విషయమే. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని లైక్ చేస్తూ ఉంటారు.. చరణ్ ఫాన్స్ చరణ్ ని లైక్ చేస్తూ ఉంటారు ..చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవిని లైక్ చేస్తూ ఉంటారు . కానీ అందరి హీరోల ఫాన్స్ ఎక్కువగా లైక్ చేసే హీరో మాత్రం మహేష్ బాబు అని చెప్పాలి . దానికి కారణం ఎటువంటి కల్మషం లేకుండా అందరి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు .

కాగా రీసెంట్గా మహేష్ బాబు తన ఫ్యామిలీతో స్కాట్ లాండ్ విషయం తెలిసిందే . అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు . అక్కడ తన కూతురు కొడుకుతో కలిసి ఎంజాయ్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి . కాకపోతే సితార ఘట్టమనేని అక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నింది. ఈ క్రమంలోనే ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సితార ఘట్టమనేని – నమ్రత – మహేష్ – గౌతమ్ పలు గేమ్స్ ఆడుతూ కనిపించారు .

అంతేకాదు ముందుగా గ్రౌండ్లో గోల్ఫ్ ఆడుతూ కనిపించిన మహేష్.. ఆ తర్వాత గన్ షూటింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అంతేకాదు ఇప్పటివరకు మహేష్ బాబు గన్ షూటింగ్ చేస్తాడు అన్న విషయం ఎవరికీ తెలియదు . పలు సినిమాలో నటించిన అదంతా ఫేక్ అనుకున్నారు . అయితే నిజంగానే మహేష్ బాబుకు గన్ షూటింగ్లో మంచి టాలెంట్ ఉందన్న విషయం ఇప్పుడే బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది . దీంతో మహేష్ లో ఈ టాలెంట్ కూడా ఉందా..? కేవలం నటిస్తాడు అనుకున్నా,.. గన్ షూటింగ్ కూడా ఎంత బాగా చేస్తాడా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news