Movies"త్వరలోనే మరో గుడ్ న్యూస్".. ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన నయనతార..!!

“త్వరలోనే మరో గుడ్ న్యూస్”.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన నయనతార..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కోలీవుడ్ హీరోయిన్ నయనతార త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతుందా ..? అంటే ఎస్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకున్న నయనతార పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులై షాక్ ఇచ్చింది . సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు అమ్మ అయిన నయనతార ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోను అదే స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తుంది.

కాగా నయనతార రీసెంట్గా షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమాలో నటించి మెప్పించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పెట్టిన దానికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు తీసుకొచ్చింది . అంతే కాదు నయనతార ఫేమ్ మరింత పెంచేసింది . అప్పటివరకు సినిమాకి 7,8 కోట్లు తీసుకుంటూ వచ్చిన నయనతార ఇప్పుడు ఏకంగా 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తుంది . దీంతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో నయనతార పేరు మారుమ్రోగిపోతుంది .

ఇలాంటి క్రమంలోనే నయనతార తన భర్త టీషర్ట్ పై “మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి” అని రాసి ఉన్న కోట్ ను షేర్ చేసింది. దీనితో త్వరలోనే నయనతార అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతుందని ..అందుకే మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి అని హింట్ ఇచ్చిందని చెప్పుకొస్తున్నారు . అయితే నయనతార చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటా..? అంటూ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కొంపతీసి మూడో బేబీకి సరోగసి ద్వారా రాబోతున్నాడా ఏంటి ..? అంటూ వ్యంగంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news