Moviesబాల‌య్య - రెజీనా కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఇదే…!

బాల‌య్య – రెజీనా కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా ఇదే…!


నందమూరి నట‌సింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఎంతోమంది హిట్ సినిమాలతో హీరోయిన్లతో నటించారు. 1980 హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తన 40 ఏళ్ల కెరీర్ లో పదుల సంఖ్యలో హీరోయిన్లతో నటించారు. విజయశాంతి, సిమ్రాన్, సుహాసిని ఆ తర్వాత తరంలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ , నయనతార లాంటి హీరోయిన్లను రిపీట్ చేస్తూ వచ్చారు.

కూడా ఇక బాలయ్యతో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో ఆశలతో ఉంటారు. రీసెంట్ కాలంలో హీరోయిన్ అంజలి బాలయ్యతో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఎప్పుడూ చెప్పేది. చివరికి ఆ కోరిక డిక్టేటర్ సినిమాతో తీరిపోయింది. అలాగే మరో హీరోయిన్ బక్క పల‌చ‌ని భామ రెజీనాకు కూడా బాలయ్య సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది.

అయితే అది దురదృష్టవశాత్తు మిస్సయింది. ఆ సినిమా ఏదో కాదు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రూలర్. ఈ సినిమాలో వేదిక – సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ కు బాలయ్యతో ఇది మూడో సినిమా. సోనాల్ చౌహాన్ స్థానంలో రెజీనాను హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు.. కూడా ఫిక్స్ అయింది.

ఆ తర్వాత సోనాల్ చౌహాన్ ఉంటే మరింత గ్లామర్ యాడ్ అవుతుందన్న ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రెజీనా ఒకవేళ ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా నటించినా బాలయ్యతో డిజాస్టర్ సినిమా చేసిన హీరోయిన్గా మిగిలిపోయి ఉండేది. మరి తర్వాత అయినా రెజీనా – బాలయ్య కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news