Newsక్రేజీ కాంబినేష‌న్‌: అట్లీ - బ‌న్నీ సినిమాకు నిర్మాత ఫిక్స్‌....!

క్రేజీ కాంబినేష‌న్‌: అట్లీ – బ‌న్నీ సినిమాకు నిర్మాత ఫిక్స్‌….!

ఇప్పుడు ఇండియన్ సినిమా స్క్రీన్ పై మోస్ట్ క్రేజీ లైన్ అఫ్ సెటప్ చేసుకున్న స్టార్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో బన్నీకి నార్త్ ఇండియాలో తిరిగి లేని క్రేజ్ వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో రిలీజ్ అయిన పుష్ప అక్కడ ఏకంగా రు. 100 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టింది.

త్వరలోనే పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బన్నీ తన తర్వాత సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు. తనకు సరైనడు లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పిన బన్నీ తాజాగా జవాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన తమిళ దర్శకుడు అట్లీతో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుద్ అన్న టాక్ కూడా బయటకు వచ్చేసింది.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుపై లేటెస్ట్‌గా మరోసారి వచ్చేసింది. ఈ సినిమాను ఏ బ్యానర్ నిర్మిస్తుందో అన్న విషయం బయటకు స్ప్రెడ్‌ అయింది. ప్రముఖ తమిళ బ్యానర్ అయిన సన్ పిక్చర్స్ వారు ఈ క్రేజీ ప్రాజెక్టును టేకప్ చేయనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే సన్ పిక్చర్స్ నుంచి రజనీకాంత్ హీరోగా సెండ్సేషనల్ హిట్ జైలర్ సినిమా వచ్చింది.

అలాగే దళపతి విజయ్‌తో కూడా ఈ బ్యానర్ లో భారీ హిట్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు బన్నీ – అట్లీ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాను ఈ బ్యానర్ టేకప్ చేయడంతో ఈ బ్యానర్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో మామూలుగా ఉండదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news