Newsదేవ‌ర సినిమాలో డైలాగుల‌పై గూస్‌బంప్స్ లాంటి అప్‌డేట్‌..!

దేవ‌ర సినిమాలో డైలాగుల‌పై గూస్‌బంప్స్ లాంటి అప్‌డేట్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవర. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ భారీ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు సౌత్, అటు నార్త్‌లో భారీ హైప్‌ నెలకొంది. వచ్చే యేడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు.

త్రిబుల్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుల్లో కూడా మామూలు అంచనాలు లేవు. ఈ సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా నడుస్తోంది. ఈ సినిమా విషయంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ బయటికి వచ్చింది.

మామూలుగానే ఎన్టీఆర్ సినిమా అంటే పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి. ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ డైలాగుల విషయంలో కొరటాల శివ చాలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర కోసం తాను ప్రత్యేకంగా కొన్ని డైలాగ్స్ లను చాలా పవర్ఫుల్.. ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఇంపాక్ట్ కలిగించేలా రాశారట.

వీటిని ఎన్టీఆర్ తనదైన మార్క్ డైలాగు డెలివరీతో పాటు సరికొత్త మాడ్యూలేషన్లో చెప్తే ఎలా ? ఉంటుందో చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా దేవరపై రోజురోజుకు అంచనాలైతే మామూలుగా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news