Moviesమ‌హేష్‌బాబు - రానా మ‌ధ్య నిజంగానే ఆ ఇష్యూ ఉందా... మాట‌లు...

మ‌హేష్‌బాబు – రానా మ‌ధ్య నిజంగానే ఆ ఇష్యూ ఉందా… మాట‌లు కూడా లేవా…?

నిజమో అబద్దమో కానీ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు మరో హీరో రానాకు మధ్య కొన్నేళ్ల క్రితం ఒక విషయంలో మాటల యుద్ధం జరిగింది అని.. అప్పటినుంచి వారి మధ్య అంత సఖ్యత ఉండదు అని.. ఇద్దరు కలిసినప్పుడు పైకి మాత్రమే హాయ్‌ అని మాట్లాడుకుంటారే తప్ప ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం అయితే లేదన్న గుసగుసలు ఉన్నాయి.

అసలు ఇద్దరి మధ్య ఎక్కడ ? తేడా కొట్టింది ఏం జరిగింది? ఆ ఇష్యూ ఏంటో చూద్దాం. మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై 2006లో సైనికుడు సినిమా వచ్చింది. త్రిష హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అదే సమయంలో రానా ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ డిజైనర్ గా పని చేశాడట. కెరీర్ ప్రారంభంలో రానా కొన్ని సినిమాలకు విఎఫ్ఎక్స్ డిజైనర్ గా పనిచేశాడట.

ఆ సినిమా వ‌చ్చాక కొన్నేళ్ల‌కు ఓ సంద‌ర్భంలో సైనికుడు సినిమా ప్లాప్ అవ్వటానికి కారణం విఎఫ్ఎక్స్ కారణమని.. రానాదే తప్పు అన్నట్టుగా మహేష్ బాబు మాట్లాడారట. అలా వీరిద్దరి మధ్య ఒక తెలియని గ్యాప్ అయితే క్రియేట్ అయింది అన్న గుసగుసలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను డైరెక్టర్ శేఖర్ క‌మ్ముల ఇంకా బాగా తీయగలడు అంటూ మహేష్ సెటైర్ వేశాడట.

మీలాంటి హీరోలు ఈ సినిమాలో ఉంటే మంచి అవుట్ ఫుట్ వస్తుంది.. టాలీవుడ్ లో సింక్ సౌండ్ టెక్నాలజీ నేర్చుకోవాలి.. డబ్బింగ్ సిస్టం తీసి పారేయాలి.. ముందుగా టాలీవుడ్ లో తెలుగు నేర్పే కోచింగ్ సెంటర్లను ప్రారంభించాలి.. పరిశ్రమంలో చాలామందికి తెలుగు మాట్లాడటమే రావటం లేదు అంటూ రానా వెటకారంగా కౌంటర్ వేసాడట. అలా ఆ టైంలో ఇద్దరు మధ్య చిన్నపాటి వారైతే జరిగిందన్న గుసగుసగా ఇండస్ట్రీలో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news