Moviesసౌత్ నుంచి ఒకే ఒక్క‌డు మ‌హేష్‌...ఏ హీరోకు లేని రేర్ రికార్డ్...

సౌత్ నుంచి ఒకే ఒక్క‌డు మ‌హేష్‌…ఏ హీరోకు లేని రేర్ రికార్డ్ మ‌నోడిదే…!

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్, నాని ఇలా ముద్దుగా మహేష్ బాబును రకరకాల పేర్లతో ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.1999లో తన తండ్రి నటశేఖర కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మహేష్‌కు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. ఓవర్సీస్ లోనూ మహేష్ సినిమాలు కలెక్షన్ సునామి క్రియేట్ చేస్తాయి.

ఇక ఈరోజు మహేష్ పుట్టినరోజు ఈ క్రమంలోనే అమెరికాలో ఆయన అభిమానులు భారీ గానే ప్లాన్ చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్‌కు శుభాకాంక్షలుతో మెసేజ్‌ల‌ వర్షం కురుస్తోంది. దీంతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన బిజినెస్‌మేన్‌ సినిమా కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్‌మేన్ సినిమా షోలకు అన్ని టిక్కెట్లు ఫుల్ అయ్యాయి.

ఇక ఓవర్సీస్ లో కలెక్షన్ల పరంగా తెలుగు హీరోలకే కాదు సౌత్ ఇండియన్ హీరోలకు కూడా అందనంత ఎత్తులో మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ నటించిన సినిమాలు ఒక‌టి రెండు కాదు ఏకంగా 11 సినిమాలు 1 మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేశాయి. అసలు తెలుగులో ఇతర హీరోలు ఎవరు ? మహేష్ కు అందనంత దూరంలో ఉన్నారు.

ఏది ఏమైనా ఓవర్సీస్ గ‌డ్డ‌ మహేష్ బాబు అడ్డా అని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. తెలుగులో మహేష్ తర్వాత స్థానాల్లో నాని, ఎన్టీఆర్ ఉన్నారు. విచిత్రం ఏంటంటే బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన 30 సినిమాలు 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేశాయి. అయితే షారుక్‌ కొన్ని వందల సినిమాలలో నటిస్తే మహేష్ కేవలం 27 సినిమాలతోనే అక్కడ 11 సార్లు వన్ మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news