Moviesఅక్టోబ‌ర్ 19న భ‌గ‌వంత్ కేస‌రి… అప్పుడే బాల‌య్య ట్విస్ట్ ఇచ్చేశాడుగా…!

అక్టోబ‌ర్ 19న భ‌గ‌వంత్ కేస‌రి… అప్పుడే బాల‌య్య ట్విస్ట్ ఇచ్చేశాడుగా…!

టాలీవుడ్ నట‌సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యక జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది.

అలాగే బాలయ్యపై ఇప్పటివరకు షూట్ చేసిన పార్ట్ ఎడిటింగ్ కూడా పూర్తయిందని.. బాలయ్య తన పాత్రకు అప్పుడే డైలాగులు కూడా చెప్పేసారని సమాచారం. బాలయ్య డైలాగ్ లు అన్ని చాలా పవర్ఫుల్ గా ఉన్నాయని.. సినిమాకు బాలయ్య డైలాగులు మెయిన్ హైలెట్గా నిలుస్తాయని.. ఈ సినిమా యూనిట్‌ ద్వారా సమాచారం అయితే ఇండస్ట్రీ వర్గాలలో లీక్ అయింది.

బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉన్నా కూడా బాలయ్య పాత్ర తాలూకు ఆలోచనలు.. యాక్టివిటీస్ చాలా చాలా సరదాగా.. జోష్‌గా కొనసాగుతాయట. అలాగే సినిమాలో తండ్రి కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. అటు అనిల్ రావిపూడి స్టైల్ లో కామెడీతో పాటు.. ఇటు బాలయ్య మార్క్ యాక్షన్ మోడ్ తో సినిమా ఉంటుందని సమాచారం.

ఏది ఏమైనా అనిల్ రావిపూడి – బాలయ్య కలయిక అనగానే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బాలయ్యను ఢీకొట్టే విధంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ రాంపాలను తీసుకున్నారు. మరి రేపు థియేటర్లలో భగవంత్ కేస‌రిగా బాలయ్య గర్జన ఎలా ? ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news