News' శ‌క్తి ' ప్లాప్ అశ్వ‌నీద‌త్ మీదకు నెట్టేశాడు.. ' భోళాశంక‌ర్...

‘ శ‌క్తి ‘ ప్లాప్ అశ్వ‌నీద‌త్ మీదకు నెట్టేశాడు.. ‘ భోళాశంక‌ర్ ‘ ప్లాప్.. శివ దే త‌ప్పంటోన్న మెహ‌ర్ ర‌మేష్‌..!

మామూలుగానే ఆ డైరెక్టర్ సినిమాలు తెలుగు వాళ్లకు అస్సలు నచ్చవు. తెలుగులో 15 సంవత్సరాల క్రిందట అతడు శంఖం అని ఒక సినిమా తీశాడు. అంతకుముందే శౌర్యం సినిమా కూడా తీశాడు. శౌర్యం కాస్త పరవాలేదు కానీ శంఖం మాత్రం పెద్ద డిజాస్టర్. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుడికి తల బొప్పి కట్టించి పంపించింది ఆ శంఖం సినిమా. ఆ తర్వాత దరువు అంటూ థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడిని థియేటర్లలో పెట్టి చితక కొట్టుడు కొట్టాడు. ఆదర్శకుడు రవితేజ నటించిన దరువు తీశాడు. ఆ సినిమా విసుగు అలాంటిది కాదు.. పొరపాటున ఆ సినిమా టీవీలో చూస్తున్నప్పుడు కూడా ఇరిటేషన్ తప్పదు.

ఇక ఆ దర్శకుడు తమిళంలో చేసిన కొన్ని సినిమాల రీమేక్‌ల‌ ఫలితాలు చూస్తే అవి నిజంగా మన హీరోలపాలిట మేకులుగా దిగాయి. వీరం రీమేక్‌ కాటమరాయుడు ఫలితం తెలిసిందే. ఇక ఇటీవల రజనీకాంత్ తో అన్నాత్తే అంటూ పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. తమిళంలో వివేకం, విశ్వాసం అంటూ అజిత్ తో మరో రెండు సినిమాలు తీశాడు. ఈ రెండు సినిమాలు అక్కడ ఆడాయి. అయితే తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ వాటిలో మిస్ అయ్యాయి. అలాంటి డైరెక్టర్ ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం తీసిన పరమ రాడ్డురంబోలా స్టోరీని ఇప్పుడు చిరంజీవి హీరోగా భోళాశంకర్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.

విచిత్రం ఏంటంటే ఈ భోళాశంకర్‌ డైరెక్టర్ శివను మించిపోయిన డిజాస్టర్ డైరెక్టర్. అసలు మెహర్ రమేష్ పేరు చెబితే శక్తి – షాడో – కంత్రి తాజాగా భోళాశంకర్ లాంటి అరివీర భయంకరమైన డిజాస్టర్ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. అసలు మెహర్ రమేష్ ను 10 ఏళ్లుగా ఏ టాలీవుడ్ హీరో కూడా దగ్గరకు రానివ్వలేదు. అయితే చిరంజీవి తన బంధువు అని కాస్త దయతలిచి దగ్గరికి చేరదీసి వేదాళం సినిమా రీమేక్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ సినిమాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వచ్చిన అవకాశం ఉపయోగించుకుంటూ ఎంతో జాగ్రత్తగా తీయాల్సింది పోయి చాలా ఘోరాతి ఘోరంగా ఓ నాసిరకం సినిమాను తీసి ప్రేక్షకుల మీదకు వదిలాడు.

తొలి షో చూసిన వెంటనే మెగా అభిమానులు కూడా పైన శివ సినిమాలు చూసి ఎలా తలలు బాదుకున్నారో అలాగే బాదుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే శక్తి లాంటి భయంకరమైన డిజాస్టర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఇటీవల ఆ సినిమా రిజ‌ల్ట్ విషయంలో తన తప్పేం లేదని నిర్మాత అశ్వినీద‌త్‌ అందులో దూరి కథను అంతా మార్చేశాడు అంటూ చాలా తెలివిగా తప్పుకున్నాడు. మరి ఇప్పుడు భోళాశంకర్ డిజాస్టర్ విషయంలో తాను ఎలాగూ తప్పు ఒప్పుకోడు.. చిరంజీవిది తప్పు అని చెప్పలేడు. ఇక ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ శివ మీద‌కు తప్పు నెట్టేస్తారేమో అన్న సెటైర్లు పడుతున్నాయి. కథ‌ శివ అలా రాసినప్పుడు తాను అంతకుమించి ఏం చేయను అని మెహర్ రమేష్ అంటాడేమో అని తెలుగు జనాలు ఓ ఆటాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news