Moviesపండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇలియానా.. రాయ‌లేని భాష‌లో తిడుతోన్న నెటిజ‌న్లు..!

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇలియానా.. రాయ‌లేని భాష‌లో తిడుతోన్న నెటిజ‌న్లు..!

ముదురు ముద్దుగుమ్మ ఇలియానా ఎట్ట‌కేల‌కు స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఎట్ట‌కేల‌కు ఇలియానా అమ్మ అయ్యింది. ఆగ‌స్టు 1న బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్టు ఆమె తెలిపింది. ఈ క్ర‌మంలోనే ఇలియానా త‌న చిన్నారి ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుని త‌న హ్యాపీ మూమెంట్ పంచుకుంది. ఈ ప్ర‌పంచంలోకి మా ప్రియ‌మైన అబ్బాయి కోవా ఫీనిక్స్ డోల‌న్‌ను ప‌రిచ‌యం చేస్తున్నాన‌ని తెలిపింది. ఇది ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేను.. మా హృదయాలను దాటి ప్రపంచానికి ఇలా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. దీనిని మాటల్లో చెప్పలేం అని ఇలియానా తెలిపారు

దీంతో కొందరు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తను తల్లి కాబోతున్నట్టు కొద్ది నెలల ముందే ప్రకటించిన ఇలియానా తన ప్రియుడి వివరాలను మాత్రం చాలా గోప్యంగా ఉంచి జూలైలో ప్రియుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అతడి వివరాలు పేరు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో కొందరు నెటిజన్లు మాత్రం ఆమెపై ఫైర్ అవుతున్నారు. నువ్వు కన్న‌ బిడ్డకు తండ్రి వివరాలు బయట ప్రపంచానికి చెప్పుకోలేని స్థితిలో ఎలా ? ఉన్నావు అసలు నీకు బుద్ధి ఉందా ? అన్న ప్ర‌శ్న‌లు వేస్తున్నారు.

కనీసం ప్రియుడుతో పెళ్లి అయిన అయిందా లేదా పెళ్లి కాకుండానే బిడ్డను కన్నావా ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. భర్త వివరాలు ఇంత రహస్యంగా ఎందుకు ? ఉంచారంటూ అతడు ఏమైనా ఉగ్రవా.. దా అని కూడా కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే ఇలియానా పై రాయలేని ఘోరమైన భాష ఉపయోగిస్తూ మండిపడుతున్నారు. ఎప్పటికైనా ఆమె స్పందిస్తే మంచిదని అభిమానులు కోరుకుంటున్నారు. ఇలియానా మంచి ఫామ్ లో ఉండగానే చేజేతులా అనాలోచిత నిర్ణయాలతో కెరీర్‌ నాశనం చేసుకొని త్వరగా ఫేడ‌వుట్‌ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news