Newsఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ వచ్చేస్తుందోచ్.. హీరో-హీరోయిన్లు ఎవరంటే..?

ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ వచ్చేస్తుందోచ్.. హీరో-హీరోయిన్లు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో ఒకప్పుడు తెరకెక్కించిన సినిమాలను మళ్లీ సిక్వెల్ గా తెరకెక్కిస్తూ సూపర్ డూపర్ హిట్టులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు డైరెక్టర్లు . ఇప్పటికే చాలామంది స్టార్ట్ డైరెక్టర్స్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు స్టార్ట్ డైరెక్టర్ – నటుడు సెల్వ రాఘవన్ . ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడో మనందరికీ బాగా తెలిసిందే .

కాగా ఇలాంటి క్రమంలోనే సెల్వ రాఘవన్ నటుడిగా కూడా మంచి పాత్రలు వేసి గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగ రీసెంట్గా సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 7/ఘ్ బృందావన కాలనీ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించబోతున్నారట. దాదాపు 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన 7/గ్ బృందావన కాలనీ ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అప్పట్లో ఈ సినిమాకి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి . అయితే తాజాగా ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు అని తెలియడంతో హీరో హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. బృందావన కాలనీ సినిమాలో రవికృష్ణ కథానాయకుడిగా నటించగా సోనాలి హీరోయిన్గా నటించింది. అయితే 7/G బృందావన కాలనీ 2 సినిమాకి మాత్రం హీరోయిన్లుగా అదితి శంకర్ – ఇవాన ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరో కోసం కొత్త నటుడిని ఎంపిక చేసుకోవాలని చూస్తున్నారట డైరెక్టర్ . చూడాలి మరి ఈ సినిమాకి మించిన హిట్ ఇస్తుందో లేదో ఈ సీక్వెల్ సినిమా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news