Moviesత్రివిక్రమ్ - బన్నీ మూవీ కథ అదే.. చిరు బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌థేనా…!

త్రివిక్రమ్ – బన్నీ మూవీ కథ అదే.. చిరు బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌థేనా…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. జులాయి – సన్నాఫ్ సత్యమూర్తి – అల‌వైకుంఠపురంలో సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో తెలిసిందే. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా పట్టాలు ఎక్కుతున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

అటు త్రివిక్రమ్.. మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ చేసే కథలు సోషియో ఫాంటసి, ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయని.. సినిమాలో మెయిన్ కథ‌ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

బన్నీ పాత్రను కూడా త్రివిక్రమ్ చాలా కొత్తగా డిజైన్ చేశాడని.. ఓవరాల్ గా అల్లు అర్జున్ తన గత సినిమాలకు భిన్నంగా సరికొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి – కే రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా స్టైల్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో చిత్రాన్ని బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. పుష్ప‌ 2 లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత తెకెక్కే సినిమా అనగానే అంచనాలు ఎలా ? ఉంటాయో చెప్పక్కర్లేదు. ఈ సినిమా టైటిల్ ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాకు థ‌మన్‌ సంగీతం అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news