Moviesఅమ్మ‌బాబోయ్‌… ప్ర‌భాస్‌కు ఆ వీక్‌నెస్ ఉందా.. ఇలా బ‌య‌ట‌ప‌డింది..!

అమ్మ‌బాబోయ్‌… ప్ర‌భాస్‌కు ఆ వీక్‌నెస్ ఉందా.. ఇలా బ‌య‌ట‌ప‌డింది..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాను ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ఆదిపురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సెప్టెంబర్లో సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్రకు దిగుతున్నాడు. అలాగే వచ్చే సంక్రాంతికి కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

కల్కి తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే సలార్, కల్కి తో పాటు సమాంతరంగా నడుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటివరకు రాజా డీలక్స్ అనే పేరు వినిపించింది. అయితే ఇప్పుడు టైటిల్ విషయంలో సరికొత్త పుకార్లు కూడా వస్తున్నాయి.

రాయల్ – అంబాసిడర్ అనే టైటిల్‌ను కూడా మారుతి పరిశీలిస్తున్నారట. అయితే రాయల్ టైటిల్ మీదే మారుతి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కథా పరంగా ప్రభాస్ క్యారెక్టర్ కి ఒక వీక్నెస్ ఉంటుంది అని.. సినిమాలో మెయిన్ స్క్రీన్ ప్లే మొత్తం ఈ వీక్నెస్ మీద నడుస్తుందని అంటున్నారు. ఈ వీక్నెస్ వల్ల వచ్చే కామెడీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news