Moviesకధ పిచ్చి పిచ్చిగా నచ్చినా..ఆ ఒక్క రీజన్ తో RX100 సినిమాను...

కధ పిచ్చి పిచ్చిగా నచ్చినా..ఆ ఒక్క రీజన్ తో RX100 సినిమాను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనకు కథ నచ్చిన సరే జనాలు ఏమనుకుంటారు .. ఆ పాత్ర చేస్తే జనాలు మనల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్న భయాలు చేత కొన్ని కొన్ని రోల్స్ మిస్ చేసుకుంటూ ఉంటారు హీరోయిన్స్ . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ నందిత శ్వేత . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నందిత శ్వేత ..ఆచితూచి సినిమాలను చూస్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు చూస్తే ప్రతి సినిమాలోను డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ పాత్రను చూస్ చేసుకుంటూ ఉంటుంది .

హిడింబి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నందిత శ్వేతా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను మిస్ చేసుకున్నాను అంటూ ఓపెన్ గా కామెంట్స్ చేసింది . ఆ సినిమా మరేదో కాదు ఆర్ఎక్స్ 100 . సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ ప్లేస్ లో మొదటగా అనుకున్న హీరోయిన్ నందిత శ్వేత అంటూ స్వయంగా చెప్పుకొచ్చింది ఆమె .

అయితే ఈ సినిమాలో కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఒకవేళ నటిస్తే జనాలు ఏమనుకుంటారో.. నెక్స్ట్ ఎలాంటి పాత్రలు వస్తాయో అన్న భయంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట . అయితే ఆ తర్వాత ఈ సినిమా హిట్ అవ్వడం చూసి మిస్ చేసుకున్నాను అంటూ బాధపడింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ గా మారింది. మొత్తానికి కధ మొత్తం నచ్చినా.. ఆ ఒక్క సీన్ కారణంగానే ఈ పాత్ర మిస్ చేసుకుని బాధపడింది హీరోయిన్ నందితా శ్వేతా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news