News"బేబీ" హీరోయిన్ వైష్ణవి చైతన్య కి రామ్ పోతినేని స్పెషల్ గిఫ్ట్.....

“బేబీ” హీరోయిన్ వైష్ణవి చైతన్య కి రామ్ పోతినేని స్పెషల్ గిఫ్ట్.. అప్పుడే మ్యాటర్ అంత దూరం వెళ్ళిపోయిందా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ..ఎక్కడ చూసినా సరే యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే మారుమ్రోగి పోతుంది. దానికి కారణం రీసెంట్గా నటించిన బేబీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ సాధించడమే . అంతే కాదు సినిమా హిట్ అవ్వడంతో సినిమాలో నటించిన స్టార్స్ ఓవర్ నైట్ లో నే స్టార్ స్టేటస్ అందుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది.

జూలై 14 న విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్స్ ఈ సినిమాని పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు . అల్లుఅర్జున్ అయితే ఏకంగా సక్సెస్ సెలబ్రేషన్స్ వచ్చి వైష్ణవి చైతన్య ఓ రేంజ్ లో పొగిడేసారు. రీసెంట్ గా వైష్ణవి చైతన్యకు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ పోతినేని స్పెషల్ గిఫ్ట్ పంపించినట్లు ట్వీట్టర్ ద్వారా అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది వైష్ణవి చైతన్య.

ట్విట్టర్ ద్వారా రామ్ పోతినేని తనకు పంపించిన స్పెషల్ బొకేను షేర్ చేస్తూ” థాంక్యూ రామ్ గారు ..ఈ పువ్వులు నాకు పంపినందుకు” అంటూ చాలా స్వీట్ నోట్ ను రాస్కొచ్చింది . ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య క్రేజ్ రోజు రోజుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెరిగిపోతుందని త్వరలోనే స్టార్ హీరోలు ఆమెకు అవకాశం ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్ . మొత్తానికి ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది వైష్ణవి చైతన్య..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news