Moviesసినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన ప్రభాస్.. ‘కామిక్ కాన్’కి వెళ్లనున్న ఫస్ట్...

సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన ప్రభాస్.. ‘కామిక్ కాన్’కి వెళ్లనున్న ఫస్ట్ ఇండియన్ ఫిలింగా ప్రాజెక్ట్ K..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా ప్రాజెక్టుకె. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది . దిశా పఠాని, అమితాబ్, కమలహాసన్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి .

తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా కి సంబంధించిన కీ అప్ డేట్ రివీల్ చేసింది. అదే ప్రాజెక్టుకె సినిమా “కామిక్ కాన్ ” అనే ఈవెంట్లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో శన్ డిఎగొ లో ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలోని నెలమూలల నుంచి అనేకమంది సినీ ప్రేమికులు ఈ ఈవెంట్ కి విచ్చేస్తారు . ఈ ఈవెంట్ ముఖ్యంగా కొన్ని కామిక్ బుక్స్ ని సినిమాలను ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది.

అయితే ఈ సంవత్సరం జూలై 19న మొదలవబోతోంది. ఈ ఈవెంట్లో జులై 20న ప్రాజెక్టుకే టీం తో పాటు ప్రభాస్ – దీపిక పదుకొనే – కమలహాసన్ పాల్గొన బోతున్నారట. దీనికి సంబంధించి ఆరోజే ప్రాజెక్ట్ కె గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారనిప్రకటించారు. చాలామందికి కామిక్స్ అంటే ఇష్టం ఉంటూ ఉంటాయి కదా ..అలాంటి వాళ్ళ కోసమే ఇది . అంటే సూపర్ హీరోస్ – డిస్నీ -మిక్కీ మౌస్ లాంటివి పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు . అందుకే సినిమాలకి సంబంధించిన వాటిని కూడా ఇలా ప్రదర్శించడానికి ఈవెంట్ పెట్టుకున్నారు . ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటివరకు ఈ కామిక్ కాన్ ఫెస్టివల్ లో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా నామినేట్ అవ్వలేదు . ఫస్ట్ టైం అలా నామినేట్ అయిన సినిమా ప్రాజెక్ట్ కె నే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news