Moviesఇంటికి వచ్చి ఆఫర్ ఇచ్చిన శంకర్..ఛీ అంటూ రిజెక్ట్ చేసిన నితిన్...

ఇంటికి వచ్చి ఆఫర్ ఇచ్చిన శంకర్..ఛీ అంటూ రిజెక్ట్ చేసిన నితిన్ .. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ కాంబోలు మిస్ అయితే .. మళ్ళీ ఆ కాంబో సెట్ చేయడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది . మరికొన్నిసార్లు అలాంటి కాంబోలు అసలు సెట్ అవ్వవు.. అలాంటి లిస్టులోకే వస్తుంది శంకర్-నితిన్ కాంబో . సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హీరో అయినా సరే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయాలి అని ఆశ పడుతూ ఉంటారు .

అలాంటి అవకాశం వస్తే చచ్చిన మిస్ చేసుకోరు . అయితే అలాంటి అవకాశం కెరియర్ స్టార్టింగ్ లోనే వచ్చినా..సరే తెలిసే తెలియక తనంతో మిస్ చేసుకొని అయ్యయ్యో అంటూ బాధపడిపోయారు. ఆ సినిమా మరేదో కాదు శంకర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాయ్స్ . హీరో సిద్ధార్ధ్ కెరియర్ ని మలుపు తిప్పిన ఈ సినిమా కథ మొదటగా నితిన్ వద్దకు వచ్చిందట .

అయితే నితిన్ అప్పటికే జయం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో డైరెక్టర్ శంకర్ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట . ఇదే విషయాన్ని నితిన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం. “శంకర్ ఇంటికి వచ్చి కధ చెప్పి..ఆ స్టోరి నచ్చినప్పుడు.. ఛీ ఛీ నా దరిద్రం ఇలా ఉందేంటి.. కమిట్ అయిన సినిమాను వదులుకోలేను.. ఈ సినిమా ఛాన్స్ వదులుకోలేను ..ఏంటి నా పోజీషన్ అని బాధపడ్డారట”. అయితే నితిన్ తలుచుకుని ఉంటే అప్పుడే ఆ సినిమాను చేసి ఉండొచ్చు.. జయం సినిమా కాల్ షీట్స్ ని అడ్జస్ట్ చేసి బాయ్స్ సినిమా కి ఇచ్చి ఉంటే బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలు పడేవి. మొత్తానికి నితిన్ అప్పటినుంచి ఇప్పటివరకు సినిమాల చూసింగ్ విషయంలో తప్పులు చేస్తూనే ఉన్నాడు . చూడాలి మరి వీరిద్దరి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news