Newsనాన్న సినిమాకి కొడుకు రివ్యూ.."బ్రో" సినిమా పై అకీరా నందన్ ఏమన్నారంటే..!

నాన్న సినిమాకి కొడుకు రివ్యూ..”బ్రో” సినిమా పై అకీరా నందన్ ఏమన్నారంటే..!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారుతుంది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైలాగ్స్ అందించారు . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నేడు రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ నమోదు చేసుకుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒకప్పటి పవన్ లా కనిపించడంతో అభిమానులు ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బద్రి సినిమా నాటి టైంలో వచ్చే డైలాగ్స్ బాడీ మోడ్యులేషన్స్ చూపించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కొద్దిసేపటి క్రితం బ్రో సినిమా చూడడానికి పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ సుదర్శన్ థియేటర్ వద్దకు వచ్చాడు . చాలా కాస్ట్లీ కారులో ఎంట్రీ ఇచ్చిన పవన్ కొడుకు అకీరానందన్ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

అంతేకాదు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఆనందంతో సినిమా చూసేందుకు సుదర్శన్ థియేటర్ వద్ద జనాలు ఎగబడ్డారు. అంతేకాకుండా ఆయనతో సెల్ఫీలు దిగడానికి కారును చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే జూనియర్ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు . దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది . అంతేకాదు అకిరా బ్రో సినిమాపై పాజిటివ్గా కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు అకీర హీరోగా ఎప్పుడెప్పుడు …ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడా అంటూ ట్రెండ్ చేస్తున్నారు జనాలు. మొత్తానికి జూనియర్ పవర్ స్టార్ కూడా త్వరలోనే తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news