Moviesవిశాల్ భార్య కావాల్సిన ఈ అమ్మాయికి పెళ్ల‌యిపోయిందా.. ఈమె కూడా ఓ...

విశాల్ భార్య కావాల్సిన ఈ అమ్మాయికి పెళ్ల‌యిపోయిందా.. ఈమె కూడా ఓ టాలీవుడ్ న‌టే అని తెలుసా..!

సెలబ్రిటీల జీవితాలలో మ్యారేజ్ అయిన తర్వాత విడాకులు తీసుకోవడం కామన్‌గా మారింది. ఇక నిశ్చితార్ధాలు ఆగిపోవడం మరింత సర్వసాధారణమైపోయింది. తాజాగా మరొక జంట తమ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు. వారు మరెవరో కాదు యాక్షన్ హీరో విశాల్, అర్జున్ రెడ్డి ఫేమ్ అనీషా అల్ల. విశాల్ పందెంకోడి, సెల్యూట్, ప్రేమ చదరంగం వంటి తెలుగు చిత్రాలు తీసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు.

ఇక అనీషా అల్ల అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితురాలుగా కనిపించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత రెండేళ్లకు స్టార్ హీరో విశాల్, అనీషా ఎంగేజ్‌మెంట్ జరిగింది. 2019లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడం, ఆ వార్త బయటకు రావడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కూడా అందరూ అనుకున్నారు.

కానీ నిశ్చితార్థం తర్వాత అనీషా, విశాల్ మధ్య తీవ్ర మనస్పర్ధలు వచ్చాయి. అందుకే వారు దానిని కాన్సిల్ చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఇంకా ఎన్ని గొడవలు అవుతాయేమోనని భయపడే వీరు ముందుగానే విడిపోయారు. ఇప్పుడు ఎవరికి వారు సపరేట్‌గా తమ కెరీర్ లైఫ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అనీషా ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి.

కాగా ఈ విషయమై అధికారికంగా ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు. కాగా తాజాగా అనీషా తన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. వాటిలో ఈ ముద్దుగుమ్మ చాలా మారిపోయి కనిపించింది. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక అనీషా చివరిసారిగా సెహరి సినిమాలో కనిపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news