Newsరామ్ చరణ్ జీవితాని టోటల్ మార్చేసింది తనేనా..? ఇప్పుడు ఈ స్దాయి...

రామ్ చరణ్ జీవితాని టోటల్ మార్చేసింది తనేనా..? ఇప్పుడు ఈ స్దాయి లో ఉండటానికి కారణం “ఆ ఆమ్మాయేనా”..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ – ఉపాసన జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. నిజానికి రాంచరణ్ కంటే ఉపాసన వయసులో పెద్దది .. అయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇండస్ట్రీలో ఎంతోమంది కుర్ర జంటలకు ఆదర్శంగా నిలుస్తుంది . అంతేకాదు ఉపాసన ఆలోచనలు – పంచువాలిటీ – క్రమశిక్షణ ..అన్ని జనాలకు తెగ నచ్చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రాంచరణ్ కన్నా ఉపాసనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు .

కాగా పెళ్ళి అయిన తర్వాత పదేళ్లకి ఉపాసన గర్భం దాల్చింది. గర్భం విషయంలో ఉపాసనని ఎంతమంది ఏ విధంగా ట్రోల్ చేసినా.. సరే ఉపాసన ఏం పట్టించుకోలేదు . నా లైఫ్ నా ఇష్టం.. నాకు ఎప్పుడు పిల్లల్ని కనాలో తెలుసు అంటూ తన ఓన్ డేసీషన్స్ ని ఫాలో అవుతూ వచ్చింది . మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన డెలివరీ కాబోతుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఈ రేంజ్ లో ఈ పొజిషన్లో ఉండడానికి .. ముఖ్యంగా రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు అందుకున్నాడు అన్నా.. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నాడు అన్నా.. ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషకం చార్జ్ చేస్తున్నాడు అన్న దానికి మెయిన్ రీజన్ ఉపాసన చేసిన మంచి పనులే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

మనకు తెలిసిందే ఉపాసన చాలా చాలా మంచి అమ్మాయి , అవసరమైన వాళ్లకి హెల్ప్ చేస్తూ.. ఎంతో మంది పేద పిల్లలకి అనాధ పిల్లలకి సహాయం చేస్తుంది. ఎంతో మందికి ప్రాణం పోస్తుంది. పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంది . ఆ పుణ్యమే మెగా ఫ్యామిలీకి ప్లస్ గా మారిందని ..అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ స్థాయిలో ఎదిగాడని జనాలు చెప్పుకొస్తున్నారు. దీంతో ఒకప్పుడు సురేఖ మెగా ఫ్యామిలీకి ఎలా కలిసి వచ్చిందో.. ఇప్పుడు ఉపాసన సైతం అలాగే కలిసొచ్చిందని.. ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మెగా కోడలు ఉపాసన మంచితనం వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news