Moviesఆ ఇద్దరి హీరోలకి క్రీమ్ బిస్కెట్స్ వేస్తున్న మమిత బైజు.. పిల్ల...

ఆ ఇద్దరి హీరోలకి క్రీమ్ బిస్కెట్స్ వేస్తున్న మమిత బైజు.. పిల్ల మహా ముదురేరోయ్..!!

మమితా బైజు .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న పేరు . మలయాళీ బ్యూటీనే. కానీ తెలుగులో బాగా బాగా పాపులారిటీ సంపాదించుకునేసింది . మరీ ముఖ్యంగా తెలుగు కుర్రాళ్ళు అమ్మడు అంటే పడి చచ్చిపోతున్నారు . దీంతో తెలుగు డైరెక్టర్లు కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మమిత బైజు మాట్లాడుతూ తనకు తెలుగులో ఇద్దరు హీరోలు అంటే ఇష్టం అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది .

అంతేకాదు మరిన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది . ఆమె మాట్లాడుతూ..” నాకు తెలుగు సినిమాలు అంటే ఇష్టం.. తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను.. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ – అల్లు అర్జున్ అంటే చాలా చాలా ఇష్టం . ఒక్క ముక్కలో చెప్పాలి అంటే చచ్చేంత ఇష్టం. రామ్ చరణ్ నటించిన మగధీర ఎన్నిసార్లు చూశానో నాకే గుర్తులేదు.. దాదాపు 50 సార్లు పైనే చూసుంటాను”..

” మలయాళం లో ధీర అనే టైటిల్ తో డబ్ చేయబడింది .. ఇక అల్లు అర్జున్ నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా నేను కచ్చితంగా చూస్తాను .. అస్సలు బోర్ కొట్టవు .. జులాయి – ఇద్దరమ్మాయిలతో సినిమాలు ఎక్కువగా లైక్ చేస్తాను. ఆయన స్టైల్ కు నేను వీరాభిమాని .అంతేకాదు స్కూల్ డేస్ లో కూడా నేను బన్నీ స్టైల్ ను ఫాలో అయ్యేదాన్ని.. టామ్ బాయ్ ల స్కూల్ కి వెళ్ళేదాన్ని “అంటూ చెప్పుకు వచ్చింది . దీంతో రామ్ చరణ్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ మమిత బైజు కామెంట్స్ ను ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news