Moviesమరి కొద్ది గంటల్లో డిశ్చార్జ్ కాబోతున్న ఉపాసన.. మెగా అభిమానులకి బిగ్...

మరి కొద్ది గంటల్లో డిశ్చార్జ్ కాబోతున్న ఉపాసన.. మెగా అభిమానులకి బిగ్ టెన్షన్ స్టార్ట్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన జూన్ 20వ తేదీ ఒంటిగంట 49 నిమిషాలకు పండులాంటి పాపకు జన్మనిచ్చారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి వీళ్ళకి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ..ట్రెండ్ అవుతున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే ఉపాసన ఈరోజు డిశ్చార్జ్ కాబోతున్నట్లు తెలుస్తుంది . అపోలో హాస్పిటల్స్ నుంచి నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లబోతుంది .

ఉపాసన గతంలోనే ఈ న్యూస్ను అఫీషియల్ గా ప్రకటించింది . “నేను చరణ్ ఇప్పుడు ఇంత స్థాయిలో ఉండడానికి కారణం మా గ్రాండ్ పేరంట్స్ ప్రేమ.. నా బిడ్డకి ఆ ప్రేమ కావాలి ..అందుకే నా బిడ్డను తీసుకొని అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఉపాసన మెగాస్టార్ చిరంజీవి ఇంటికెళ్లే ముందు అపోలో హాస్పిటల్స్ బయట మీడియా సమావేశంలో కొంత సేపు మాట్లాడబోతున్నారు అంటూ తెలుస్తుంది .

ఈ క్రమంలోని తమ బిడ్డకు విషెస్ అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా థాంక్స్ చెప్తూనే తాను ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్న కేర్ గురించి చెప్పబోతుందట ఉపాసన . అంతేకాదు ఇప్పటివరకు ఉపాసనకి సిజరిన్..? నార్మల్ డెలివరీ ..?అన్నది తెలియలేదు . బహుశా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో ఉపాసన చెప్పొచ్చు అంటూ చెప్పకు వస్తున్నారు అభిమానులు. అంతేకాదు మెగా వారసురాల్ని చూడాలని కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఆమె ఫోటో కానీ ఆమె పిక్చర్ కానీ మీడియాకి రిలీజ్ చేస్తారా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నిటికీ తెర పడాలి అంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news