Newsప్రభాస్ రేంజ్ అంటే ఇది.. ఇటలీలో ఉంటున్న బంగ్లా రెంట్ ఎంతో...

ప్రభాస్ రేంజ్ అంటే ఇది.. ఇటలీలో ఉంటున్న బంగ్లా రెంట్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ఆది పురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టింది . అయితే ఈ సినిమా పై ఇంకా అరా కొరా నెగటివ్ టాక్ వినిపిస్తూనే ఉంది.

అసలు ఓం రావత్ తీసింది రామాయణమే కాదని.. రాముడు పాత్రకి ప్రభాస్ సూట్ అవ్వడని..సీత పాత్రకి కృతి సనన్ వేస్ట్ అని .. ఆ గ్రాఫిక్స్ చండాలంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశారు . అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఆది పురుష్ సినిమా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే ప్రభాస్ ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆది పురుష్ సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ ఇటలీకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల అక్కడ రెస్ట్ తీసుకుంటారు అంటూ సమాచారం అందుతుంది . ఈ క్రమంలోని ఇటలీలో సేద తీరేందుకు ఓ విలాసవంతమైన విల్లాను కూడా రెంటుకు తీసుకున్నారు అంట ప్రభాస్ . సన్నిహితులతో కలిసి ఆ విల్లాలోన్వ ప్రభాస్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారట . అయితే ఆ విల్లా రేట్ తెలిస్తే మాత్రం కళ్ళు తేలేయాల్సిందే. అక్షరాల 40 లక్షలు నెలకు చెల్లిస్తున్నాడట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సైతం షాక్ అయిపోతున్నారు . అయితే కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రభాస్ కి ఇది ఓ లెక్కా..? అంటూ జనాలు కొట్టి పడేస్తున్నారు . కాగ త్వరలోనే ప్రభాస్ నటించిన ప్రాజెక్టుకే , సల్లార్ సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news