Moviesమహాలక్ష్మి లాంటి మనవరాలకి..పవన్ కళ్యాణ్ అద్దిరిపోయే గిఫ్ట్.. మెగా ఫ్యాన్స్ ఫిదా..!!

మహాలక్ష్మి లాంటి మనవరాలకి..పవన్ కళ్యాణ్ అద్దిరిపోయే గిఫ్ట్.. మెగా ఫ్యాన్స్ ఫిదా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఉపాసన రాంచరణ్ ల పాపకు సంబంధించిన డీటెయిల్స్ ఏ వైరల్ గా మారాయి. కాగా గత పదేళ్ళుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ ఇవ్వడంతో మెగా ఫాన్స్ మెగా కుటుంబం ఉబ్బితబ్బి అయిపోతున్నారు . ఈ క్రమంలోనే ఉపాసన చరణ్ కు పుట్టిన పాపను మెగా ప్రిన్సెస్ గా ట్యాగ్ చేసి మరి సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చూస్తున్నారు .

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం మా ఇంటికి పుట్టిన మహాలక్ష్మి ఇది ..మంగళవారం రోజు ఆ దేవుడే మా ఇంటికి మహాలక్ష్మి తీసుకొచ్చాడు అంటూ కామెంట్స్ చేయడం ట్రెండ్ అవుతుంది . ఇలాంటి క్రమంలోనే అపోలో హాస్పిటల్ లో ఉన్న ఉపాసన తన బేబిని చూడడానికి సినీ ఇండస్ట్రీ కదిలి వెళుతుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు ఉపాసనని చూడడానికి అపోలో హాస్పిటల్ కి వెళ్ళగా ..చ్రణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ హాస్పిటల్ కి చేరుకోలేదు .

దానికి మెయిన్ రీజన్ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడమే ..ఈ క్రమంలోని తను రాలేకపోయిన తన బ్లెస్సింగ్స్ ను తన స్పెషల్ గిఫ్ట్ను అందజేశాడు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా వేదికగా పాప పుట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ..ఆనందపడిన పవన్ కళ్యాణ్ ..తన మనవరాలికి ఏకంగా లక్ష్మీదేవి చైన్ చేయించి గిఫ్ట్ గా పంపించారట . అంతేకాదు ఉపాసనతో కాల్ చేసి మరి స్పెషల్ గా మాట్లాడారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు చరణ్ చిన్నప్పటి నుంచి చరణ్ ని పవన్ కళ్యాణ్ పెంచాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే తాను పెంచిన అబ్బాయికి ఇంకొక బిడ్డ పుట్టడం పవన్ కళ్యాణ్ లైఫ్ లో స్పెషల్ మూమెంట్ గా మిగిలిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news