Newsఏం పాపం చేసాడో..? లాస్ట్ రోజు కమెడియన్ మనోబాల అంత బాధను...

ఏం పాపం చేసాడో..? లాస్ట్ రోజు కమెడియన్ మనోబాల అంత బాధను అనుభవించాడా..? చివరి వీడియో వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మనకి తెలియని విషయాలను కూడా తెలియజేస్తుంది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు వివరిస్తుంది ఈ సోషల్ మీడియా . ఈ క్రమంలోని రీసెంట్గా అనారోగ్య కారణంగా మరణించిన తమిళ్ కమెడియన్ మనోబాలకు సంబంధించిన లాస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మనోబాల దర్శకుడుగా ..రచయితగా కూడా పాపులారిటీ తెచ్చుకున్నాడు .

మే మూడవ తేదీన ఆయన అనారోగ్య కారణంగా మరణించారు . ఆయన మరణం పై చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కోలీవుడ్ – టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు . ఆయన చివరిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. కాగా..రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆయన హాస్పిటల్ లో ఉన్న చివరి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది .

ఆ వీడియో ఆధారంగా .. పూర్తి అనారోగ్య కారణంగా బాధపడుతున్న ఆయన కనీసం మాట్లాడడానికి కూడా కష్టంగా బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆయనను ఎంత మాట్లాడించడానికి ట్రై చేస్తున్న ఆయన నోరు మెదపడం లేదు. అంతేకాదు చేతులు కూడా కదపలేని పొజిషన్లో ఆయన చాలా చిత్రవధ అనుభవించినట్లు ఈ వీడియో ఆధారంగా తెలుస్తుంది . అంతేకాదు ఆయన కుమారుడు ఒక పాటను చాలా అద్భుతంగా పాడారు . మనోబాల కొడుకు పాటను వింటూ ఆనందంగా ఆస్వాదించారు . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మనోబాల లివర్ సంబంధిత వ్యాధికి గురయ్యారు. ఇంటి వద్ద చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే మల్టీ టాలెంటెడ్ ఉన్న మనోబాల మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news