Newsఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ "ప్రేమించుకుందాం రా" సినిమాని రిజెక్ట్ చేసిన...

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ “ప్రేమించుకుందాం రా” సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..దరిద్రం అంటే ఇదేగా..!!

సినిమా ఇండస్ట్రీలో రోజుకి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని హిట్ అవుతాయి కొన్ని ఫ్లాప్ అవుతాయి . కానీ కొన్ని కొన్ని సినిమాలు ఏళ్ళు తరబడిన జనాలు అలాగే ఆదరిస్తూ ఉంటారు . అలాంటి ఓ సినిమానే “ప్రేమించుకుందాం రా..!!”. టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా క్రేజీ రికార్డ్ నమోదు చేసుకున్న ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలన రికార్డులను నెలకొల్పింది.

ఈ సినిమా అప్పట్లో ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఓ ప్రేమ కథకు నాంది పలికింది ఈ సినిమానే. దీంతో అప్పట్లో ప్రేమించుకుందాం రా సినిమా ను ఓ రేంజ్ లో జనాలు విపరీతంగా లైక్ చేశారు . ఈ సినిమాలో హీరోయిన్గా అంజలా జవేరీ నటించింది . 1997 మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది . ఈ సినిమాలో వెంకటేష్ – అంజలా జవేరీ ప్రేమ సన్నివేశాలు ..ప్రతి నాయకుడుగా నటించిన జయప్రకాశ్ రెడ్డి నటించిన నటన టూ హైలైట్ గా మారింది.

అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా అనుకునింది అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయిని అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దర్శకుడు జయంత్ ఈ సినిమాలో ఐశ్వర్య రాయిని హీరోయిన్గా అనుకున్నారట . ఆ తర్వాత ఐశ్వర్య ఈ పాత్ర రిజెక్ట్ చేయడంతో పలువురు హీరోయిన్స్ ని అప్రోచ్ అయినా ..ఫైనల్లీ అంజలా జవేరీ దగ్గరికి వచ్చి ఈ కథ ఆగిందట . అయితే ఐశ్వర్య ఈ సినిమాలో ఎక్కువగా మాస్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని.. ఆ కారణంగానే రిజెక్ట్ చేసింది అన్న న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది .

ఏది ఏమైనా ఐశ్వర్య ఈ సినిమాలో నటించి ఉంటే తెలుగులో కూడా స్టార్ హీరోయిన్గా మారిపోయుండేది. దరిద్రం పక్కనుంటే ఎవరేం చేస్తారు అంటూ జనాల సైతం ఐశ్వర్యాను ట్రోల్ చేస్తున్నారు
. ఏ మాటక ఆ మాట ఈ పాత్రకు అంజలా జవేరీ నే బాగుంది ఐశ్వర్య ఈ పాత్రకు న్యాయం చేసి ఉండేది కాదు అన్నది అభిమానుల అభిప్రాయం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news