Moviesఅంత మంది బూతులు తిడుతున్నా.. సమంత నెం 1 స్దానంలో నిల్చోవడానికి...

అంత మంది బూతులు తిడుతున్నా.. సమంత నెం 1 స్దానంలో నిల్చోవడానికి కారణం అదేనా..? ఇలాంటి పనులు కూడా చేస్తుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే . ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్నా.. ఇప్పటికి స్టార్ హీరోయిన్గా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని అదే లిస్టులో కంటిన్యూ అవుతుంది అంటే సమంతకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత పేరు సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది.

మరీ ముఖ్యంగా సమంత ని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఐఎండిబి రిలీజ్ చేసిన లిస్టులో ఇండియన్ పాపులర్ యాక్టర్స్ జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది సమంత . బాలీవుడ్ బాడా హీరోలను కూడా వెనక్కినెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అగ్రస్థానాన్ని సంపాదించుకోవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండియన్ మూవీ డేటా బేస్ 2022 లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలను ప్రకటించగా అందులో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఇక అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు సైతం వెనక్కి తగ్గారనే చెప్పాలి.

ఈ క్రమంలోనే ఎందుకు సమంత నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునింది.. మిగతా హీరోయిన్స్ చేసుకోలేకపోయారు అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న తర్వాత సమంత మరింత పాపులారిటీ సంపాదించుకుందని.. కంటెంట్ విషయంలో బోల్డ్ విషయంలో ఏమాత్రం అడ్డు పెట్టుకోవట్లేదని.. ఈ క్రమంలోనే సమంత లో ఉన్న టాలెంట్ మొత్తం ఓపెన్ అయిపోయిందని ..అందుకే సమంతను జనాలు ఎక్కువగా లైక్ చేస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే ఇంతమంది హీరోలను నెట్టి సమంత నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే అది నిజంగా గర్వకారణమే అంటున్నారు సమంత ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news