Moviesవిజయ్ వర్మ తో తమన్నా రోమాన్స్..కడుపు మండిన తెలుగు హీరో ఏం...

విజయ్ వర్మ తో తమన్నా రోమాన్స్..కడుపు మండిన తెలుగు హీరో ఏం చేసాడో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా – నటుడు విజయ్ వర్మ లవ్ స్టోరీ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళు మేము ప్రేమించుకుంటున్నామంటూ అఫీషియల్ గా చెప్పలేదు కానీ ..పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ మాత్రం తమ ప్రవర్తనతో హింట్ ఇచ్చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విజయవర్మతో తమన్నా ఎలాంటి ఫొటోస్ దిగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అంతేనా న్యూ ఇయర్ సందర్భంగా ఏకంగా లిప్ లాక్ చేసింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది . ఈ క్రమంలోనే బాలీవుడ్ లో విజయ్ వర్మ – తమన్నాల ప్రేమాయణం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే విజయవర్మతో తమన్న లవ్ లో ఉంది అని తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కడుపు మండిపోయిందట . ఎందుకంటే అతగాడు తమన్నాకి డై హార్ట్ ఫ్యాన్ .

ఇప్పటివరకు ఆమెతో కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు . త్వరలోనే అవకాశం రాకపోతుందా..? అంటూ ఎదురు చూస్తున్నాడట . అయితే ఒకవేళ నిజంగానే విజయ్ ని- తమన్న పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా రొమాంటిక్ సీన్స్ లో నటించదు. పెళ్లిలోపే అలా చేయాలి . పెళ్లిలోపు తమన్నతో నటించే అవకాశం వస్తుందో..? లేదో..? తెలియదు .

ఈ క్రమంలోనే ఈ జంటకు సంబంధించిన పిక్స్ ఎక్కడ కనిపించినా సరే కాలి చేస్తున్నాడట ..చించేస్తున్నాడట. పేపర్లో వీళ్ళ ఫోటోలు కనిపించినా కూడా చించేసి మరి ఆ పేపర్లను కాలి చేస్తున్నాడట . ఏది ఏమైనా తమన్నా అంటే అభిమానం ఉండొచ్చు కానీ.. ఇంత పిచ్చి అభిమానం ఉండకూడదు అన్నది జనాల ఒపీనియన్..రేపటి రోజు తమన్న అమెడలో తాళ్ళి కనిపిస్తే ఈ హీరో ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news