Movies"ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే"... ఫస్ట్ టైం హద్దులు మీరిన రేణు...

“ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే”… ఫస్ట్ టైం హద్దులు మీరిన రేణు దేశాయ్.. అసలు ఏమైందంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు.. తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 22 సంవత్సరాల క్రితం వచ్చిన బద్రి సినిమాతో ఆమె హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆమె మరోసారి పవన్ కి జోడిగా జానీ సినిమాలోని నటించారు.

కొంతకాలం పవన్ కళ్యాణ్ తో కలిసి సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన రేణు.. 2012లో పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చేశారు. అప్పటినుంచి ఆమె పూణేలో తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్.. తన పిల్లలు, త‌న‌ కుటుంబం గురించి వివరాలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్లోకి ఇస్తుంది.

ఇదిలా ఉంటే ఈనెల 8న తన కొడుకు అఖీరా నంద‌న్‌ పుట్టినరోజు సందర్భంగా మెగా హీరోలతో పాటు పలువురు మెగా అభిమానులు అఖీరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొందరు అభిమానులు మాత్రం హద్దులు దాటి ప్రవర్తించడంతో రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడం ఇది చాలా అన్యాయం.. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి.. మా అన్న కొడుకును చూడాలని మాకు ఉంటుంది.. మీరు తప్పించుకోవద్దు… అప్పుడప్పుడు అయినా వీడియోలలో అఖీరా బాబుని చూపించండి అంటూ పవన్ అభిమానులు కామెంట్లు చేశారు.

దీనికి రేణు దేశాయ్ బదులిస్తూ మీ అన్న కొడుకా ? అకీరా నా కొడుకు మీరు.. ఒక తల్లికి పుట్టలేదా మీరు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అని నేను అర్థం చేసుకోగలను.. కానీ కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి.. ఇలాంటి కామెంట్లు నేను చాలా వరకు డిలీట్ చేస్తున్నాను.. అయితే కొందరు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.. నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కామెంట్లు చదవటం చాలా బాధేస్తుందని వాపోయింది. 11 ఏళ్లుగా నన్ను ఒక చెడ్డదానిగా.. విలన్ లా చూస్తున్నారు. ఇదంతా చూసి నేను విసిగిపోయాను అంటూ రేణు తన కోపం ప్రదర్శించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news