Moviesఅస్సలు ఎవరు ఈ కృష్ణవేణీ..? హేమగా ఎలా మారింది..? రేవ్ పార్టీతో...

అస్సలు ఎవరు ఈ కృష్ణవేణీ..? హేమగా ఎలా మారింది..? రేవ్ పార్టీతో బయటపడ్డ సంచలన నిజాలు..!!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే . ఆఫ్ కోర్స్ ఎన్నోసార్లు ఎన్నో రేవు పార్టీలు జరిగిన ఈ రేంజ్ లో హైలైట్ అవ్వలేదు. కానీ ఈ రేవ్ పార్టీ మాత్రం చాలా సంచలనంగా మారింది . దానికి కారణం టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ 100 మందికి పైగా పార్టీలో పాల్గొనడం అన్న విషయం కూడా అందరికీ తెలుసు . టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు కన్నడ పోలీసుల వద్ద సమాచారం ఉంది . అందరికీ నోటీసులు పంపించారు . అయితే ఈ రేవ్ పార్టీలో అందరికన్నా హైలెట్ గా మారిన పేరు మాత్రం హేమ అనే చెప్పాలి . హేమ అసలు రేవ్ పార్టీకి వెళ్లిందా ..? వెళ్లలేదా..? అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు హేమ రేవ్ పార్టీకి వచ్చింది అంటూ ఫొటోస్ రిలీజ్ చేసిన ..ఆమె మాత్రం నేను రేవ్ పార్టీకి వెళ్లలేదు అంటూ ధీమాగా చెప్పడం చూస్తున్న జనాలు షాక్ అయిపోతున్నారు.

కాగా ఈ క్రమంలోనే హేమ .. కృష్ణవేణి అనే పేరు చెప్పి ఇదే పార్టీలో తన నేమ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నింది అన్న విషయం కూడా బయటపడింది . దీంతో అసలు ఈ కృష్ణవేణి ఎవరు ..? ఆమె పేరు చెప్పుకొని హేమ ఎందుకు తప్పించుకోవాలని చూసింది..? అనే విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది . ఈ క్రమంలోనే హేమ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వైరల్ అవుతున్నాయి . తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది తెలుగు సినిమాల్లో నటించింది .

హీరోయిన్ కి ఫ్రెండ్ గా హాస్య నటిగా అక్కగా , వదినగా పలు ఇంపార్టెంట్ పాత్రలు పోషిస్తూ తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. అయితే బిగ్బాస్ ద్వారా హేమ ఆంటీ అంటూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం హేమ స్పెషాలిటీ. అయితే నిజానికి హేమ అసలు పేరు కృష్ణవేణి సయ్యద్ అంటూ తెలుస్తుంది . ఆమె సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా రాజోలు . ఆమె వయసు 56ఏళ్లు.. చిన్నప్పటి నుంచి నటి కావాలి అని కలలు కనేది కృష్ణవేణి . అలా కలలు కన్న కృష్ణవేణి మన ముందుకి హేమగా వచ్చి చేరింది .

ఆమె నటిగా సెటిల్ అవ్వడానికి ఎన్నో ఎన్నో కష్టాలు పడింది . చెన్నై వెళ్లి డాన్స్ కూడా నేర్చుకునింది . మొత్తానికి కల నెరవేర్చుకుంది. ప్రేమించిన జాన్ సయ్యద్ అనే అతన్ని వివాహం చేసుకొని కృష్ణవేణి సయ్యద్గా మారింది . ఆమెకు ఒక కూతురు కూడా ఉంది . బాలకృష్ణ నటించిన భలే దొంగలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసింది హేమ. దాదాపు 500 కు పైగా చిత్రాలు నటించి మెప్పించింది .టీవీ సీరియల్స్ లో కూడా నటించింది . ఇన్ని సంవత్సరాల లో ఆమె కెరియర్ లో ఒక్కటంటే ఒక్క బ్యాడ్రీ మార్క్ కూడా తనపై వేసుకోలేదు .. ఫర్ ద ఫస్ట్ టైం రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంది అంటూ ప్రచారం జరిగింది. అంతేనా ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ నమూనాలు కూడా ఉండడం సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు హేమకి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news