Moviesఅమ్మ బాబోయ్..నాలుగు గంటల ఈవెంట్ కోసం ప్రభాస్ అన్ని డేస్ కష్టపడ్డాడా..?...

అమ్మ బాబోయ్..నాలుగు గంటల ఈవెంట్ కోసం ప్రభాస్ అన్ని డేస్ కష్టపడ్డాడా..? నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే కల్కి సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది వరల్డ్ గా అయిపోయింది. టాలీవుడ్ నుంచి వస్తున్న మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే కావడం గమనార్హం. ఇంటర్నేషనల్ వైడ్ రీచ్ అందుకుంటున్న మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. ప్రమోషన్స్ లో కూడా అదే లెవెల్ ని మైంటైన్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్వీన్.

మహానటి సినిమా తర్వాత ఎంతో కాన్సన్ట్రేషన్ గా ఇష్టంగా భారీ బడ్జెట్ తో నాగ్ అశ్వీన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. ఈ క్రమంలోనే రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కల్కి సినిమాకి హైలైట్ అయిన బుజ్జి పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు నాగ్ అశ్వీన్. దీనికోసం ఏకంగా ఒక ఈవెంట్ ని కండక్ట్ చేశారు . ఈ ఈవెంట్ కోసం నాగ్ అశ్వీన్ ఎంత కష్టపడ్డాడు అన్న విషయం వీడియో క్లిప్స్ చూస్తేనే అర్థమయిపోతుంది .

కాగా హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈవెంట్ కు పెద్ద ఎత్తున అభిమానులు హాజరై ఈ ఈవెంట్ ని భారీ సక్సెస్ చేశారు . అయితే ఈవెంట్ కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో వివరించారు మేకర్స్. మరీ ముఖ్యంగా డిజైనర్ కారు తో బయట స్టాంట్ చేయడం ఓకే కానీ బార్కెడ్లు నిర్మించిన గ్రౌండ్లో అలాంటి స్టాంట్ చేయడం మాత్రం చాలా చాలా టఫ్ జాబ్ .. అటు ఇటు ఏం మాత్రం కొంచెం జరిగిన భారీ ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చాలా డేస్ ప్రాక్టీస్ చేసి ఎలాంటి రిస్క్ లేకుండా జెన్యూన్ గా ఒరిజినాలిటీని ప్రజెంట్ చేయడానికి డార్లింగ్ బాగా కష్టపడ్డారట.

రోజుకి ఐదు గంటలు చొప్పున ఈ స్టంత్స్ కోసం ఒరిజినల్ గా కష్టపడ్డారట . అంతేకాదు దాదాపు 15 రోజుల నుంచి ప్రభాస్ ఈ స్టంట్స్ కోసమే ప్రాక్టీస్ చేశాడట . అంతేనా కల్కి సినిమా కోసం కూడా ప్రభాస్ భారీ స్థాయిలో కష్టపడ్డాడు అని .. కచ్చితంగా ఆయన కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమా రిజల్ట్ ద్వారా తెలుస్తుంది అని మేకర్స్ చెప్పుకొచ్చారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్ – కమల్ హాసన్ -దీపికా పదుకొనే -దిశా పటాని ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు . జూన్ 27వ తేదీ ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news