Moviesఅక్కినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య బ‌య‌ట ప‌డ్డ విబేధాలు…?

అక్కినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య బ‌య‌ట ప‌డ్డ విబేధాలు…?

సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య విభేదాలు కామన్. అలాగే ఒక ఫ్యామిలీకి.. మరో ఫ్యామిలీకి మధ్య కూడా వృత్తిపరమైన యుద్ధాలు నడుస్తూ ఉంటాయి. అయితే బయటికి మాత్రం ఫంక్షన్లలో కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా వాటేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే లోపల మాత్రం వారి ఆధిపత్య పోరు, మనస్పర్ధలు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. వేరువేరు కుటుంబాల హీరోల మధ్య మాత్రమే కాదు.. ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ములు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల మధ్య కూడా ఇలాంటి వివాదాలు కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మంచు ఫ్యామిలీ – మెగా ఫ్యామిలీ – నందమూరి ఫ్యామిలీ లోనే హీరోల మధ్య అంత సఖ్యత లేదని చెబుతూ ఉంటారు.

ఇటీవల మంచు బ్ర‌ద‌ర్స్ మధ్య ఉన్న విభేదాలు బహిరంగంగానే బయటపడ్డాయి. అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు బన్నీ – చరణ్‌ మధ్య, బన్నీ – పవన్ కళ్యాణ్ మధ్య కూడా విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. తాజాగా అక్కినేని బ్రదర్స్ మధ్య ఉన్న విభేదాలు కూడా బయటికి వచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరు సొంత అన్నదమ్ములు కాదు.

వీరిద్దరూ ఒక తల్లికి పుట్టకపోయినా తండ్రి మాత్రం ఒక్కరే కావటం విశేషం. అయితే ఎక్కడికి వెళ్ళినా ఈ అక్కినేని బ్ర‌ద‌ర్స్‌ జంటగానే కలిసి వెళుతూ ఉంటారు. వీరి మధ్య కూడా నిజంగానే విభేదాలు ఉన్నాయా ?అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో అవును అన్న చర్చ‌ కొత్తగా వినిపిస్తోంది. తాజాగా అక్కినేని అఖిల్ పుట్టినరోజు జరిగింది. అఖిల్ పుట్టినరోజుకు చాలామంది సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలిపారు.

అయితే నాగచైతన్య మాత్రం తన తమ్ముడికి ఎక్కడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్టు కనిపించలేదు. ఇక వ్యక్తిగతంగా ఏమైనా ఫోన్లో విషెస్ చెప్పాడా లేదా ? అన్నది మాత్రం తెలియదు.
నాగచైతన్య మాజీ భార్య అయిన, స్టార్ హీరోయిన్ సమంత మాత్రం తన మాజీ మరిది అఖిల్‌కు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పింది. దీనికి అఖిల్ రిప్లై కూడా ఇచ్చాడు.

ఇదంతా చూస్తుంటే అఖిల్ – చైతు మధ్య కూడా గ్యాప్ ఉందా లేదా ? చైతు అఖిల్ కి ఫోన్ లో విషెస్ చెప్పాడా అన్నది అర్థం కావడం లేదు. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం వీరు మధ్య గ్యాప్ ఉంద‌న్న‌ ప్రచారం జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news