Moviesబ్రేకింగ్‌: మ‌హిళా ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర‌కు తీవ్ర గాయాలు…

బ్రేకింగ్‌: మ‌హిళా ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర‌కు తీవ్ర గాయాలు…

సినిమా ఇండ‌స్ట్రీలో వ‌రుస‌గా ఏదో ఒక విషాదాలు, ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. జ‌మున‌, క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ మృతితో దిగ్భ్రాంతితో ఉన్న ఇండ‌స్ట్రీకి ఇప్పుడు మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌ముఖ మ‌హిళా ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర తీవ్రంగా గాయ‌ప‌డ‌డ్డారు. దీంతో ఆమె చేతికి పెద్ద దెబ్బ త‌గిలింది. దీంతో క‌ట్టు క‌ట్టిన వైద్యులు ఆమె నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు.

ఆమె చాలా అదృష్ట‌వ‌శాత్తు పెద్ద గాయంతో భ‌య‌ట‌ప‌డ్డార‌ని.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పించుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక త‌న‌కు గాయాలు అయిన విష‌యాన్ని సుధ కొంగ‌ర స్వ‌యంగా చెప్పారు. త‌న‌కు దెబ్బ త‌ల‌గ‌డంతో చాలా బాధ‌గా ఉంద‌ని.. నెల రోజులు రెస్ట్ త‌ప్ప‌ద‌ని కూడా ఆమె ట్వీట్ చేశారు. తాను జీవితంలో ఇలాంటి బ్రేక్ ఎప్పుడూ కోరుకోలేద‌ని కూడా ఆమె స్ప‌ష్టం చేశారు.

ఇక వెంక‌టేష్‌తో గురు లాంటి డిఫ‌రెంట్ మూవీ తెర‌కెక్కించి హిట్ కొట్టిన ఆమె ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్‌తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వ‌స్తోంది. సుధ గాయ‌ప‌డ‌డంతో అక్ష‌య్‌కుమార్ సినిమాకు అనుకోని బ్రేక్ వ‌చ్చేసింది.

ఈ సినిమా త‌ర్వాత సుధ ప్ర‌ముఖ క‌న్న‌డ బ్యాన‌ర్ అయిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఓ సినిమా ఆమె చేయ‌నున్నారు. ఇక సుధ గాయ‌ప‌డిన విష‌యం ఫొటోతో స‌హా పెట్ట‌డంతో ప‌లువురు ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news