Moviesఫ్యాన్స్ కి కొరటాల శివ మెగా బిస్కెట్..అభిమానులు అంత బకరాలా..?

ఫ్యాన్స్ కి కొరటాల శివ మెగా బిస్కెట్..అభిమానులు అంత బకరాలా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . నిన్న మొన్నటి వరకు కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆచార్య సినిమాతో బిగ్గెస్ట్ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో కొరటాల శివ మీడియాకు కనిపించడమే మానేశారు . కాగా ఆ ఫ్లాప్ నుంచి బయట పడాలంటే కచ్చితంగా హిట్ అవ్వాలి . ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాను ఎప్పుడో కమిట్ అయిన కొరటాల శివ ఎన్టీఆర్ థర్టీ సినిమాను త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు .

కాగా ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కొరటాలకు మధ్య ఎలాంటి పరోక్షకమైన వార్ జరిగిందో మనందరికీ తెలిసిందే . డైరెక్టర్స్ కథను ఎలా తీయ్యాలో నేర్చుకోవాలి అంటూ స్టేజి మీద పరోక్షంగా కొరటాలకు కౌంటర్ వేశాడు మెగాస్టార్ చిరంజీవి . ఇలాంటి టైంలోనే మెగా ఫాన్స్ కూడా కొరటాలపై గుర్రుగా ఉన్నారు . అయితే ఇలాంటి క్రమంలో ఆ మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ సినిమాకు నెగిటివ్ కాకూడదని కొరటాల శివ ఏకంగా ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా చిరంజీవిని పిలవనున్నారట.

అంతేకాదు ఇదే ఈవెంట్ కి అల్లు అర్జున్, రామ్ చరణ్ సైతం రాబోతున్నారు అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . అయితే దీనిపై మెగా అభిమానులు మాత్రం అంత పాజిటివ్గా లేరని తెలుస్తుంది . మీ సినిమా హిట్ అవ్వడానికి మెగాస్టార్ ని వాడుకుంటావా..? మేమంతా బకరాలా కనిపిస్తున్నామా ..? అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసి మరి కొరటాల సినిమాను ట్రోల్ చేస్తున్నారు. లాంచింగ్ ఈవెంట్ కు ముందే ఎన్టీఆర్ థర్టీ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కీరవాణి కూడా ఈ ఈవెంట్ కి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల అంటూ క్రేజీ గాసిప్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news