Movies"నన్ను వాడుకుని మోసం చేసారు".. తెలుగు హీరో పై రకుల్ సంచలన...

“నన్ను వాడుకుని మోసం చేసారు”.. తెలుగు హీరో పై రకుల్ సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని .. సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలని చాలామంది ముద్దుగుమ్మలకి ఉంటుంది . అయితే దాన్ని చాలా తక్కువ మంది మాత్రమే ఫుల్ ఫిల్ చేసుకోగలరు . అదే లిస్ట్ లోకి వస్తుంది రకుల్ ప్రీత్ సింగ్ . తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. మొదటి సినిమాతోనే కూల్ అండ్ క్లాసిక్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమాలో రకుల్ ప్రీత్ నటించిన నటనకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఫిదా అయిపోయారు. మెల్ట్ అయిపోయి తమ సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు .

సీన్ కట్ చేస్తే ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైం లోనే టాలీవుడ్ బడా హీరోస్ అయిన బాలకృష్ణ – నాగార్జున – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలలో అవకాశం అందుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రజెంట్ బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తన ఫిలిం కెరియర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తను చాలా ఇబ్బందులు పడ్డానని.. కనీసం సరైన సదుపాయాలు లేక బ్యాగులోనే డ్రస్సులు పెట్టుకుంటూ కార్లోనే డ్రస్సులు మార్చుకొని మరి ఆడిషన్స్ కి వెళ్ళాను అని చెప్పుకొచ్చింది.

“చాలామంది స్టార్స్ తో సినిమా షూట్ చేసినా కూడా తన ప్లేస్ లోకి వేరే హీరోయిన్స్ తీసుకున్నారని .. ఆ టైంలో నేను ఏమాత్రం బాధపడలేదని ..నా టాలెంట్ కి తగ్గ పాత్రలు కచ్చితంగా వస్తాయని ..వేచి చూశానని ..ప్రజెంట్ ఇప్పుడు నేను టాప్ హీరోయిన్ పొజిషన్లో ఉండడానికి కారణం అదే అని భావిస్తున్నాను “అని చెప్పుకొచ్చింది .

ఈ క్రమంలోనే గతంలో టాలీవుడ్ బడా హీరో ఓ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా అనుకొని కొన్ని షాట్లు తీశాక అదే ప్లేస్ లోకి అందాల ముద్దుగుమ్మ కాజల్ ను హీరోయిన్గా తీసుకున్న న్యూస్ వైరల్ అవుతుంది . ఏది ఏమైనా సరే పేరు చెప్పకుండా తెలుగు హీరో పేరును బయట పెట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్ అంటూ జనాలు ఆ తెలుగు హీరో పేరు నెట్టింట ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news